
ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలోనే మే 4 నుంచి 15వ తేదీ మధ్య ఈ తరహా ఘటనలు మరికొన్ని చోటు చేసుకున్నాయి. కుకీ కమ్యూనిటీకి చెందిన మహిళలను టార్గెట్ చేసి మైతీ వర్గానికి చెందినవాళ్లు దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తున్నది. జూన్ 12న రిజిస్టరైన కంప్లైంట్స్లోని వివరాలు తాజాగా జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యు)కి చేరాయి. మే 4న కుకీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన కాంగ్పోప్కి జిల్లాలో జరిగింది. ఓ బాధిత మహిళ తండ్రి, తమ్ముడిని మైతీ తెగకు చెందినవాళ్లు చంపేశారు. జులై 19న ఈ వీడియో బయటికొచ్చింది. ఇద్దరు బాధిత మహిళలు ప్రస్తుతం రిలీఫ్ క్యాంపులో ఉన్నారు.
గదిలో వేసి గ్యాంగ్ రేప్
ఇలాంటి మరో ఘటన మే 4న జరిగింది. నర్సింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్న కుకీ తెగకు చెందిన 22 ఏండ్ల మహిళ, ఆమె స్నేహితురాలిని మైతీ తెగకు చెందిన 40 మంది దాడి చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇంఫాల్‌లోని కొనుంగ్ మమాంగ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. మైతీ వర్గానికి చెందిన కొందరు యువకులు ఇద్దరు స్టూడెంట్స్‌ను దాదాపు రెండు గంటలు గదిలో బంధించి వేధింపులకు పాల్పడ్డారు. గది తెరిచి చూడగా ఇద్దరు రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు.
చంపేస్తామని బెదిరించి సామూహిక అత్యాచారం
తర్వాత మే 15న ఇంఫాల్‌లోని ఓ ఏరియాలో 18 ఏండ్ల యువతిని మైతీ వర్గానికి చెందిన కొందరు కిడ్నాప్‌కు ప్రయత్నించారు. యువతి ప్రతిఘటిస్తుండటంతో ముక్కలు.. ముక్కలుగా నరికేస్తామని బెదిరించారు. తర్వాత ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. నాగాలాండ్ కోహిమాలోని ఓ హాస్పిటల్లో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా.. దాడి చేసి.. గ్యాంగ్ రేప్ జరిగినట్లు నిర్ధారణ అయింది.