ఐదేళ్ల చిన్నారిపై  లైంగిక దాడికి యత్నం

V6 Velugu Posted on Sep 21, 2021

  • నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు

ఇబ్రహీంపట్నం, వెలుగు: జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలో ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన మైనర్​పై పోలీసులు పోక్సో యాక్ట్​కింద కేసు ఫైల్​చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బర్దిపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం వినాయక నిమజ్జన శోభయాత్ర కార్యక్రమం జరుగుతోంది. దాన్ని చూస్తున్న ఓ ఐదేళ్ల చిన్నారిని అదే గ్రామానికి చెందిన యువకుడు(17) మసీదు వద్ద ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. అతని నుంచి తప్పించుకుని వచ్చిన పాప జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో చిన్నారి పేరెంట్స్​సోమవారం ఇబ్రహీంపట్నం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్ట్​కింద కేసు నమోదు చేశారు. మరోవైపు తమపై పాప కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని యువకుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 

Tagged jagtial district, CHILD, , Rape Attempted

Latest Videos

Subscribe Now

More News