
మేషం (మార్చి21 – ఏప్రిల్20) :- అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆదాయం కొంత పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయులు దగ్గరవుతారు. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. ఒక సమాచారం విద్యార్థులకు ఊరటనిస్తుంది. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగులకు హోదాలు ఉత్సాహాన్నిస్తాయి.
వృషభం (ఏప్రిల్21 – మే21) : - పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం. నూతన విద్యావకాశాలు దగ్గరకు వస్తాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. గృహ నిర్మాణాల్లో ముందడుగు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు సమకూరతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, ఇంక్రిమెంట్లు దక్కవచ్చు.
మిథునం (మే22 – జూన్22) : - ఆదాయ, వ్యయాలు సమానం. అనుకున్న కార్యాలలో ఆలస్యమైనా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులు ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. మీ అభిప్రాయాలతో బంధువులు ఏకీభవిస్తారు. సమాజంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి.
కర్కాటకం (జూన్23 – జూలై23) : - చేపట్టిన కార్యక్రమాలు సమయానికి పూర్తి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. యుక్తితో సమస్యలను అధిగమిస్తారు. మీ సలహాలు కుటుంబసభ్యులను ఆకట్టుకుంటాయి. రాబడి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.
సింహం (జూలై24 – ఆగస్టు22) : - మీ కష్టం ఫలించే సమయం. ఆప్తుల నుంచి కీలక సందేశం అందుతుంది. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. చేపట్టిన కార్యక్రమాలను ఎవరి సాయం లేకుండా పూర్తి చేస్తారు. ఖర్చులు ఎదురైనా తట్టుకునే స్థితి ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరతాయి. విద్యార్థులు మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పనిఒత్తిడులు, బాధ్యతల నుంచి విముక్తి.
కన్య (ఆగస్టు23 – సెప్టెంబర్22) : - చేపట్టిన కార్యక్రమాలు కష్టతరమైనా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు సాధిస్తారు. ఇళ్ల నిర్మాణాలు చేపడతారు. రావలసిన డబ్బు సమకూరుతుంది. కుటుంబంలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఉద్యోగాన్వేషణలో విజయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులు అనుభవాలతో సంస్థలను విస్తరిస్తారు. ఉద్యోగులకు మార్పులు ఊరటనిస్తాయి.
తుల (సెప్టెంబర్23 – అక్టోబర్22) : - అనుకున్న కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనాలు కొంటారు. మీ నిర్ణయాలను అందరూ శిరోధార్యంగా భావిస్తారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.
వృశ్చికం (అక్టోబర్23– నవంబర్22) : - ముఖ్య కార్యాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేకతను చాటుకుంటారు. రావలసిన డబ్బు అందుతుంది. వివాహాది వేడుకలకు హాజరవుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం ఉండవచ్చు. మీపట్ల కఠినంగా వ్యవహరించిన వారే ప్రశంసిస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు హోదాలు మరింత పెరుగుతాయి.
ధనుస్సు (నవంబర్23 – డిసెంబర్22) : - మీ ఊహలు నిజం చేసుకుంటారు. శ్రమ పెరిగినా అనుకున్న కార్యక్రమాలు పూర్తి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. సోదరులు, స్నేహితులతో సఖ్యత. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం. ఆదాయానికి లోటు ఉండదు. సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఉద్యోగార్ధుల యత్నాలు సఫలం. వాహన, గృహయోగాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.
మకరం (డిసెంబర్23 – జనవరి22) : - ఎదురుచూస్తున్న అవకాశాలు విద్యార్థులకు దగ్గరవుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ముఖ్య కార్యక్రమాలు అవలీలగా పూర్తి. వాహనాలు, భూములు కొంటారు. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. కొన్ని సమస్యలు తీరతాయి. వివాహయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారులకు పెట్టుబడులు దక్కే అవకాశం. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగుతాయి.
కుంభం (జనవరి23 – ఫిబ్రవరి22) : - ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. చేజిక్కిన అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగార్ధుల యత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. ప్రత్యర్థులు సైతం మీపట్ల విధేయులుగా మారవచ్చు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. వ్యాపారులకు గతం కంటే మెరుగైన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు.
మీనం (ఫిబ్రవరి23 – మార్చి20) :- మీ సత్తా, నైపుణ్యం చాటుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న కార్యక్రమాల్లో విజయం. బంధువులతో సత్సంబంధాలు. వివాహ యత్నాలు సానుకూలం. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. కొన్ని సమస్యలు, వివాదాలు నేర్పుగా పరిష్కారం. భవిష్యత్తుపై నిరుద్యోగులకు భరోసా. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు విశేష లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగులకు పనిభారం మరింత తగ్గుతుంది.