డబ్ల్యూటీసీ ఫైనల్ 2023: గాయంతో స్టార్ పేసర్ దూరం

డబ్ల్యూటీసీ ఫైనల్ 2023: గాయంతో స్టార్ పేసర్ దూరం

ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జ‌ట్టు స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయంతో ఫైన‌ల్ మ్యాచ్‌కు దూరమాయ్యాడు. గత కొంతకాలంగా మోకాలు, మడమ గాయంతో బాధపడుతున్న హేజిల్‌వుడ్, ఇండియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆడలేదు. ఆపై ఐపీఎల్ 16వ సీజ‌న్‌లోనూ రెండు మ్యాచులే ఆడాడు. గాయపడ్డ హేజిల్‌వుడ్ స్థానంలో ఆల్‌రౌండర్ మైకేల్ నీసర్‌‌ని ఎంపిక చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా.   

టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌ ముగియగానే ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సమయంలో హేజిల్‌వుడ్ దూరమవ్వడం ఆసీస్ కు గట్టి దెబ్బే అని చెప్పాలి. 33 ఏళ్ల నీసర్ ఇప్పటిదాకా ఆస్ట్రేలియా తరుపున 2 టెస్టులు, 2 వన్డేలు మాత్రమే ఆడాడు. 2 టెస్టుల్లో 7 వికెట్లు తీసిన నీసర్, వన్డేల్లో 2 వికెట్లు పడగొట్టాడు. 

టెస్టు ఛాంపియన్‌షిప్ ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్,  అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్,  పాట్ కమ్మిన్స్(కెప్టెన్) స్కాట్ బోలాండ్, మార్కస్ హారీస్, జోష్ ఇంగ్లీష్, నాథన్ లియాన్, టాడ్ ముర్ఫీ, మైకేల్ నేసర్, మిచెల్ స్టార్క్