హోరాహోరీ పోరులో డెన్మార్క్పై ఆస్ట్రేలియా గెలుపు

హోరాహోరీ పోరులో డెన్మార్క్పై ఆస్ట్రేలియా గెలుపు

ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఆస్ట్రేలియా నాకౌట్కు చేరుకుంది. గ్రూప్Dలో భాగంగా డెన్మార్క్తో జరిగిన మ్యాచ్లో  1–0తో గెలిచి..16 ఏళ్ల తర్వాత రౌండ్ 16 లో అడుగుపెట్టింది.  ఫిఫా వరల్డ్ కప్లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా మూడు మ్యాచుల్లో రెండింటిని గెలిచిన ఆస్ట్రేలియా ఒక ఓటమితో నాకౌట్కు దూసుకెళ్లింది. 

డెన్మార్క్  ఆధిపత్యం

మ్యాచ్ ప్రారంభం నుంచి డెన్మార్క్ బాల్ను తన నియంత్రణలో ఉంచుకుంది. ఎటాకింగ్ గేమ్తో పలు మార్లు ఆస్ట్రేలియా గోల్ పోస్టుపై దాడి చేసింది. మొదటి 25 నిమిషాల్లో ఆ జట్టు మూడు సార్లు గోల్ కొట్టేందుకు ప్రయత్నించినా..ఫలితం రాలేదు. అటు డెన్మార్క్ దూకుడుకు ఆస్ట్రేలియా చురకైన డిఫెన్స్తో అడ్డుకట్ట వేసింది. దీంతో మొదటి అర్థభాగంలో  ఏ జట్టు గోల్ కొట్టలేకపోయింది.

మాథ్యూ లెక్కీ గోల్తో గెలుపు.. ..

రెండో భాగంలో ఆస్ట్రేలియా పుంజుకుంది. అద్భుతమైన ఆటతీరుతో డెన్మార్క్కు చుక్కలు చూపించింది. ఇది సమయంలో 60వ నిమిషంలో  మెరుపులా ప్రత్యర్థి గోల్‌ ప్రాంతానికి చొచ్చుకొచ్చిన మాథ్యూ లెక్కీ..గోల్ గొట్టి..జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఇదే ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న ఆస్ట్రేలియా..1–0తో విజయం సాధిచింది. 

డెన్మార్క్ నిష్క్రమణ..

ఈ విజయంతో గ్రూప్‌డిలో  ఆస్ట్రేలియా  3 మ్యాచ్‌ల్లో 2 గెలుపు, ఒక ఓటమితో  రెండో స్థానంలో నాకౌట్కు చేరుకుంది. ఒక డ్రాతో రెండు ఓటములతో డెన్మార్క్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. డెన్మార్క్పై గెలిచిన ఆస్ట్రేలియా వరుసగా 6 టోర్నీల్లో వరుస విజయాలు సాధించిన టీమ్గా నిలిచింది.