జీవితంలో షార్ట్ కట్ లను దూరం పెట్టండి

జీవితంలో షార్ట్ కట్ లను దూరం పెట్టండి
  • ఐఐటీ స్టూడెంట్లకు ప్రధాని మోడీ సూచన 

లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు ప్రధాని మోడీ. ప్రతీ రెండు రోజులకోసారి యూపీలో పర్యటిస్తున్నారు. ఇవాళ కాన్పూర్ మెట్రోను ప్రారంభించారు. గత ప్రభుత్వాలు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని దోపిడీ చేశాయని ఆరోపించారు. ఐఐటీ కాన్వొకేష్ లో పాల్గొన్నారు. విద్యార్థులు సవాళ్లను స్వీకరించాలని సూచించారు మోడీ. 
డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ లో అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. టైర్ 2, టైర్ 3 సిటీలపై ఫోకస్ చేసి అభివృద్ధిని విస్తరిస్తున్నామని చెప్పారు. 2014కు ముందు దేశంలో 5 సిటీల్లో మాత్రమే మెట్రో రైల్ సర్వీస్ ఉండగా... ఇప్పుడు 27 నగరాలకు విస్తరించిందని చెప్పారు. గత ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్ లో మాఫియాను పెంచి పోషించాయన్నారు.  సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉత్తరప్రదేశ్ ను మళ్లీ ఆర్డర్ లో పెట్టారన్నారు. కాన్పూర్ లోనే పెర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో కోట్లాది రూపాయల డబ్బు దొరికిన విషయం గుర్తు చేసిన మోడీ... ప్రతీది తామే చేశామని చెప్పుకునే సమాజ్ వాదీ పార్టీ... ఇప్పుడు మాత్రం నోరుమూసుకుందని విమర్శించారు. 
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సిటీలో మెట్రో రైలు ఐఐటీ నుంచి మోతీ జీల్ ఏరియా వరకు 9 కిలోమీటర్ల స్ట్రెచ్ పూర్తి కాగా... దానిని మోడీ ఓపెన్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి హర్ దీప్ సింగ్ పురిలతో కలసి మెట్రోలో ప్రయాణం చేశారు మోడీ. అలాగే బీనా-పంకీ మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ ప్రాజెక్టును కూడా మోడీ ప్రారంభోత్సవం చేశారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో ఉన్న బీనా రిఫైనరీ నుంచి కాన్పూర్ దగ్గర్లోని పంకీ వరకు 356 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మించారు.  
అంతకుముందు కాన్పూర్ ఐఐటీ 54వ కాన్వొకేషన్ లో పాల్గొన్న మోడీ లైఫ్ లో షార్ట్ కట్స్ ని దూరం పెట్టాలని స్టూడెంట్స్ కు సూచించారు. సవాళ్లను ఎదుర్కొని... సరైన పరిష్కారాలతో వాటిని అధిగమించాలన్నారు. కంఫర్ట్, ఛాలెంజ్ లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి వస్తే ఛాలెంజ్ ను ఎంచుకోవాలని తాను చెబుతానన్నారు. వరల్డ్ లో ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ స్టార్టప్ హబ్ గా ఎదిగిందన్నారు. దేశంలో 50వేలకు పైగా స్టార్టప్స్ ఉంటే... అందులో 10వేలకు పైగా గత 6 నెలల్లోనే వచ్చాయన్నారు. 5G టెక్నాజీ అభివృద్ధిలో కాన్పూర్ ఐఐటీ పాత్రను ప్రపంచం గుర్తించిందన్నారు. కాన్వొకేషన్ తర్వాత ఐఐటీ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు మోడీ. క్యాంపస్ లోని మరో బిల్డింగ్ కు వెళ్లిన మోడీ... కాన్వొకేషన్ కు అటెండ్ కాని స్టూడెంట్స్ తో మాట్లాడారు.

 

 

 

ఇవి కూడా చదవండి

గోదావరిపై 6 ప్రాజెక్టులకు అనుమతివ్వండి

MLA,MLCల సమక్షంలోనే టీఆర్ఎస్ నాయకుల కొట్లాట

సుకుమార్ గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైన అల్లు అర్జున్