తడి, పొడి చెత్త సేకరణపై మహిళలకు అవగాహన

తడి, పొడి చెత్త సేకరణపై మహిళలకు అవగాహన
  •      రాష్ట్ర పంచాయతీ  రాజ్ సలహాదారులు కొండలరావు 

 బెజ్జంకి, వెలుగు: రానున్న రోజుల్లో కొన్ని మండలాలను  యూనిటీగా ఏర్పాటు చేసి ప్లాస్టిక్ నిర్వాణ బాధ్యతలను స్వశక్తి సంఘాలకు బాధ్యతలు అప్పగించనున్నట్టు  రాష్ట్ర పంచాయతీరాజ్ సలహాదారులు కొండలరావు తెలిపారు.  సిద్దిపేట జిల్లా బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో డంపింగ్ యార్డ్ ను, తడి చెత్త పొడి చెత్తను  పరిశీలించారు.  తడి చెత్త పొడి చెత్త గురించి మహిళా సంఘ సభ్యులకు  సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ ( గ్రామీణ) డైరెక్టర్ సురేశ్​ బాబు,  డీఆర్డీఓ జయదేవ్ ఆచార్య, డీపీఓ  దేవకీదేవి, హుస్నాబాద్, సిద్దిపేట డీఎల్ పీ ఓ లు వెంకటేశ్వర్లు, మల్లికార్జున్, డీపీఎం కరుణాకర్, ఎంపీడీవో లక్ష్మప్ప, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.