సిమెంట్‌‌ కంపెనీలకు బ్యాడ్‌‌ డేస్

సిమెంట్‌‌ కంపెనీలకు బ్యాడ్‌‌ డేస్

డిమాండ్‌‌ లేక ఇబ్బందులు
రిటైల్‌ రేట్లు మాత్రం ఎక్కువే

న్యూఢిల్లీ: సిమెంట్‌‌‌‌ ఇండస్ట్రీ మరోసారి ఆపదలో చిక్కుకుంది. కొన్ని నెలల క్రితం వరకు సిమెంట్‌‌‌‌ కంపెనీలకు బాగానే ఆదాయం వచ్చింది. డిమాండ్‌‌‌‌ బాగుండటంతో సిమెంట్ రేట్లు పెరిగాయి. ఇప్పుడు కరోనా క్రైసిస్‌‌‌‌ ఉండటం, బిజినెస్‌‌‌‌లు మూతబడటం, వర్షాలు జోరుగా కురుస్తుండటంతో కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. అమ్మకాలు దారుణంగా దెబ్బతిన్నాయి. డిమాండ్ పడిపోయింది. ఇవన్నీ చాలవన్నట్టు ప్రొడక్షన్‌‌‌‌ ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి.  ఇప్పట్లో సిమెంట్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ పెరగడం సాధ్యం కాకపోవచ్చని కంపెనీలు అంటున్నాయి. కరోనా కేసులు పెరగడంతో కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌ను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏప్రిల్‌‌‌‌, మే నెలల్లో నిర్మాణ పనులు దాదాపు పూర్తిగా నిల్చిపోయాయి.

పడిపోతున్న డిమాండ్

ప్రస్తుతం సిమెంట్‌‌‌‌ సెక్టార్‌‌‌‌ ఎన్నడూ లేనంత కష్టకాలంలో ఉందని, డిమాండ్‌‌‌‌ విపరీతంగా తగ్గిందని అల్ట్రాటెక్‌‌‌‌ సిమెంట్‌‌‌‌, ఏసీసీ లిమిటెడ్ ఇన్వెస్టర్‌‌‌‌ ప్రెజెంటేషన్లలో, రిపోర్టుల్లో స్పష్టం చేశాయి. ఈ 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ డిమాండ్‌‌‌‌ కనిపిస్తోందని వెల్లడించాయి. కరోనా క్రైసిస్‌‌‌‌ ఇప్పట్లో ముగిసేలా లేదు కాబట్టి డిమాండ్‌‌‌‌ పెరగడానికి చాలా సమయం పడుతుందని అల్ట్రాటెక్ స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పనితీరు బాగుండకపోవచ్చని ఇన్వెస్టర్లకు తెలియజేసింది. ఏసీసీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. డిమాండ్‌‌‌‌ ఎన్నడూ లేనంతగా తగ్గిందని ప్రకటించింది. కంపెనీలు అంచనా వేసినంత అధ్వానంగా పరిస్థితులు లేవని ఎక్స్‌‌‌‌పర్టులు వాదిస్తున్నారు. వార్షిక ప్రాతిపదికన చూస్తే జూలై–ఆగస్టులో డిమాండ్‌‌‌‌ 2–4 శాతం మాత్రమే తగ్గిందని రీసెర్చ్‌‌‌‌ ఫర్మ్‌‌‌‌ మాకరీ లెక్కగట్టింది. కంపెనీలు మాత్రం ఇది ఆరు శాతం వరకు ఉండొచ్చని అంచనా వేశాయని తెలిపింది. జూన్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో డిమాండ్‌‌‌‌ 34 శాతం వరకు పడిపోతుందన్న అంచనాలూ నిజం కాలేదని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ 17 శాతం తగ్గుతుందని అంటున్నారని, ఇది 14 శాతం దాటకపోవచ్చని హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌బీసీ గ్లోబల్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ తెలియజేసింది. ఏటా ఆగస్టులో వానలు ఎక్కువ కాబట్టి సిమెంట్‌‌‌‌ అమ్మకాలు మిగతా నెలలతో పోలిస్తే 12 శాతం తగ్గుతాయి. ఈసారి కరోనా కూడా తోడవటం వల్ల అమ్మకాలు మరింత తగ్గాయి.

ఖర్చులు పెరుగుతున్నాయ్‌‌‌‌..

సిమెంట్‌‌‌‌ తయారీలో వాడే పెట్‌‌‌‌ కోక్‌‌‌‌ రేట్లు పెరిగాయి. డీజిల్‌‌‌‌ రేట్లు తరచూ పెరుగుతున్నాయి. రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. సిమెంట్‌‌‌‌ కంపెనీల ఆపరేటింగ్‌‌‌‌ ఖర్చుల్లో 60 శాతానికిపైగా ఇవే ఉంటాయి. టన్ను పెట్‌‌‌‌ కోక్‌‌‌‌ ధర ఈ ఏడాది మేలో 61 డాలర్లు ఉండగా, ఇప్పుడు 90 డాలర్లకు చేరింది. దీని ధర నెలకు దాదాపు 12 శాతం పెరుగుతున్నదని కంపెనీలు చెబుతున్నాయి. డీజిల్‌‌‌‌ రేట్లు ఏటా కనీసం పదిశాతం పెరుగుతున్నాయి. ఈ ఏడాది కొన్ని నెలల్లో మాత్రమే దీని రేట్లు తగ్గాయి. సిమెంట్‌‌‌‌ కంపెనీల దగ్గర ఎప్పుడూ దాదాపు మూడు నెలల స్టాక్‌‌‌‌ ఉంటుంది. పెరిగిన రేట్ల ఎఫెక్ట్‌‌‌‌ తెలియాలంటే డిసెంబరు వరకు ఆగాల్సిందే.

For More News..

పండుగ షాపింగ్‌కి నో ఇంట్రెస్ట్

అసైన్డ్ భూములు దర్జాగా అమ్మి పత్తాలేకుండా పోయిన లీడర్లు, రియల్టర్లు

వీడియో: ఒక కాలు లేకున్నా.. ఒంటికాలుతో పొలం పనులు