అప్పు చేసి జీతాలిచ్చిన బైజూ రవీంద్రన్‌‌‌‌

అప్పు చేసి జీతాలిచ్చిన బైజూ రవీంద్రన్‌‌‌‌

న్యూఢిల్లీ:  మార్చి నెల శాలరీస్‌‌‌‌ను ఇచ్చేందుకు బైజూస్ సీఈఓ  బైజూ రవీంద్రన్‌‌‌‌  పర్సనల్‌‌‌‌గా లోన్‌‌‌‌  తీసుకున్నారు.  రూ.25–30 కోట్ల వరకు అప్పు తీసుకున్నారని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. మార్చి నెలకు గాను ఉద్యోగుల శాలరీస్‌‌‌‌లో  కొంత మొత్తాన్ని శనివారం వేశారు. జీతంలో 50 నుంచి 100 శాతం వేశారని ఉద్యోగులు చెబుతున్నారు. ‘రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన ఫండ్స్ ఇంకా బ్లాక్ అయి ఉండడంతో శాలరీలను ఇచ్చేందుకు  బైజూ రవీంద్రన్ పర్సనల్‌‌‌‌గా ఫండ్స్ సేకరిస్తున్నారు’ అని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. 

టీచర్లు, కిందిస్థాయి ఉద్యోగులు 100 శాతం జీతాన్ని అందుకున్నారని అన్నారు. 200 మిలియన్ డాలర్లను  రైట్స్ ఇష్యూ ద్వారా  బైజూస్‌‌‌‌ సేకరించిన విషయం తెలిసిందే. కానీ, షేర్‌‌‌‌‌‌‌‌ హోల్డర్లయిన జనరల్‌‌‌‌ అట్లాంటిక్‌‌‌‌, సోఫినా, ప్రోసస్‌‌‌‌, పీక్ ఎక్స్‌‌‌‌వీ  ఎన్‌‌‌‌సీఎల్‌‌‌‌టీలో బైజూ రవీంద్రన్‌‌‌‌కు, ఆయన ఫ్యామిలీకి  వ్యతిరేకంగా కేసు ఫైల్ చేశారు.  రైట్స్ ఇష్యూ ఫండ్స్‌‌‌‌ను కంపెనీ వాడుకోకుండా ఎన్‌‌‌‌సీఎల్‌‌‌‌టీ తీర్పిచ్చింది. ఈ ఇష్యూపై మంగళవారం హియరింగ్ ఉంది.