కుస్తీ వీరుడి ముందుచూపు

కుస్తీ వీరుడి ముందుచూపు

తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పుతప్పే. ఒకే ఒక్క తప్పు.. మొత్తం కెరీర్ కేముప్పు తెస్తుం ది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పూడ్చలేని నష్టం జరిగిపోతుం ది. ఈవిషయాలు కుస్తీ వీరుడు బజరంగ్ పూనియాకి బాగా తెలుసు. అందుకే..గతంలో నర్సింగ్ యాదవ్ కి ఎదురైన చేదు అనుభవం నుంచి పాఠం నేర్చుకుంటున్నాడు. ఫుడ్ కంటామినేషన్ గానీ మరే సమస్య గానీ తలెత్తకుండా ముందు చూపు ప్రదర్శిస్తున్నా డు. ప్రపంచస్థాయి ఆటగాడిలా పక్కాగా ఆలోచిస్తున్నా డు..ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ రెజ్లర్(కుస్తీ వీరుడు) అయిన బజరంగ్ పూనియా..వచ్చే నెల 21 నుం చి 2 8 వరకు చైనాలో జరిగేఆసియా ఛాంపియన్ షిప్ కు క్వాలిఫై కావటం ఎవరికీఆశ్చర్యం కలిగిం చలేదు. కానీ.. అతను తాజాగాతీసుకున్న ఒక నిర్ణయమే అందరికీ ఆసక్తికరంగామారిం ది. రెజ్లిం గ్ లో 65 కేజీల విభాగంలో బరిలోదిగుతున్న పూనియా.. నేషనల్ క్యాంప్ లో భాగంగాకొద్ది రోజుల పాటు భాల్ గఢ్ (హర్యానా)లో ని స్పోర్స్ట్అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్ ) ట్రైనిం గ్ సెం టర్లోనే ఉండి ప్రాక్టీస్ చేశాడు. ఫిబ్రవరి 28 నుం చిమార్చి 3 వరకు బల్గేరియాలో జరిగిన డాన్ కొలొవ్రెజ్లిం గ్ టోర్నమెంట్ లో గోల్డ్​ మెడల్ తో ఇండియాకితిరిగొచ్చాడు. అనంతరం సాయ్ సెం టర్ నుం చిఅదే జిల్లా కేం ద్రం(సోనిపట్ )లోని తన ఇంటికివెళ్లి పోవాలని; రోజూ అక్కడి నుం చే ట్రైనిం గ్కి, ప్రాక్టీస్ కి అటెండ్ అవ్వాలని నిర్ణయిం చుకున్నాడు. పూనియా ఇల్లు సాయ్ సెం టర్ కి 15కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. సాయ్ శిక్షణా కేం ద్రంలో పూనియాకిప్రభు త్వం మూడు రూమ్ ల క్వార్టర్ నుకేటాయించిం ది. సౌకర్యాలకు కూడా ఏలోటూ రానీయలేదు.

అయినా ఎందుకిలా?

బజరంగ్ పూనియా గవర్నమెంట్ ట్రైనిం గ్ సెం టర్ లోఉండకుం డా సొంతిం టికి వెళ్లి పోవాలని డిసైడ్ కావటం వెనకబలమైన కారణం ఉంది. 2016రియో ఒలిం పిక్స్​కి ముందు ఇక్కడే ఉండి ప్రాక్టీస్చేసిన మరో ఇండియన్ రెజ్లర్ నర్సిం గ్ యాదవ్ ఆమెగా టోర్నీలో తన ఈవెంట్ కి ఒక్క రోజు ముందురెండు యాంటీ డోపిం గ్ టెస్టుల్ లో ఫెయిల్ అయ్యాడు.మెటా న్డియెనోన్ అనే డ్రగ్ ను వాడినట్లు తేలటంతో‘కోర్ట్​ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్​’ అతనిపై నాలుగేళ్లు నిషేధం విధించిం ది. ఫలితంగా రియో ఒలిం పిక్స్​కి దూర మయ్యాడు. నర్సిం గ్ యాదవ్ కి కనీసంఈవెంట్ ని కంప్లీట్ చేసే ఛాన ్సైనా ఇవ్వాలని మనదేశంలోని నేషనల్ యాంటీ డోపిం గ్ ఏజెన్సీ(ఎన్ఏడీఏ: నాడా) కోరినా ‘వరల్డ్​ యాంటీ డోపిం గ్ఏజెన్సీ’ పట్టిం చుకోలేదు. యాంటీ డోపిం గ్ టెస్టుల్ లోపాజిటివ్ అని తేలిన తర్వాత నర్సిం గ్ యాదవ్ పోలీసులకు ఒక కంప్లైం ట్ ఇచ్చాడు. ట్రైనిం గ్ సెం టర్లో ఉండగా తన ఫుడ్ ని​, వాటర్ ని ఎవరో కావాలనే,కుట్రపూరితంగా కలుషితం చేశారని ఆరోపిం చాడు.ఈ కేసును ప్రస్తు తం సీబీఐ విచారణ జరుపుతోం ది.తదుపరి విచారణ ఈ నెల 29న ఢిల్లీ హైకోర్టులోఉంది. దర్యాప్తు​ పూర్తై తీర్పు ఎలా వచ్చినా జరిగిననష్టా న్ని మాత్రం ఎవరూ తిరిగి భర్తీ చేయలేరు. ఇదే..పూనియాను పునరాలోచనలో పడేసిం ది. యాదవ్ కిజరిగినట్లే తనకూ జరగదనే గ్యారంటీ లేదనేది అతనిభయం. అందువల్లే అక్కడే ఉండి అనవసరంగా రిస్క్​ తీసుకోవటం ఎందుకు అనుకున్నాడు. ముందే జాగ్రత్తపడటం బెటరని ఈ నిర్ణయం తీసుకున్నాడు.క్రీడాకారులకు ప్రతి అంశమూ కీలకమే. డైలీ ఫిట్ నెస్ను కాపాడుకోవాలి. డౌట్ ఫుల్ డ్రింక్స్​కి దూరంగాఉండాలి. కంటి నిం డా నిద్ర పోవాలి. ఆటలో అనుక్షణం మారి పోయే పరిస్థితులకు తగ్గట్లు తక్షణంనిర్ణయం తీసుకోవాలి. ప్రత్యర్థి కన్నా ఒక అడుగుముందుం డాలి. అప్పుడే విజయం సాధ్యం . సక్సెస్ నేశ్వాసగా భావిం చే ప్లేయర్లు ఇవన్నీ సెం ట్ పర్సెం ట్ పాటిస్తారు. 2020 ఒలిం పిక్స్​లో ఇండియా జెం డా ఎగరేయాలనే పట్టుదలతో ఉన్న పూనియా ఇలా కేర్ ఫుల్గా ఉండటం ఆయనకు, దేశానికి ఎంతో అవసరం.

పద్మశ్రీ పూనియా

కుస్తీ వీరుడిగా భజరంగ్ పూనియా దేశ క్రీడారంగానికి చేసిన సేవలకు గాను అతన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుతో సత్కరించిం ది.ఇండియాలో నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైనపద్మశ్రీని పూనియా ఈ నెల 11న రాష్ట్రపతి భవన్ లోజరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిం ద్చేతుల మీదుగా స్వీకరిం చాడు.

కెరీర్ కు ముప్పు రాకూడదనే…

నేను ఈ నిర్ణయం తీసుకోవటానికి గతసంఘటనలే పూర్తి ఆధారం కాకపోయినా అవీఒక కారణమే. మా ఇంటికి, సాయ్ సెంటర్ కిమధ్య దూరం 15 కిలోమీటర్లే. ప్రయాణానికిపెద్దగా టైం పట్టదు. కాబట్టి రోజూ అక్కడికిఈజీగా అప్ అండ్ డౌన్ చేస్తా. బయటిభోజనంతో పోల్చితే ఇంట్లోని ఆహారపదార్థా లను పూర్తిగా నమ్మొచ్చు. ఫుడ్విషయంలో మరిన్ని జాగ్రత్తలుతీసుకోవటానికి అవకాశం ఉంటుంది.నేషనల్ క్యాంప్ లను ఎప్పుడూ భాల్ గఢ్సాయ్ సెంటర్ లోనే నిర్వహిస్తారు. ప్లేయర్లుఅక్కడే ఉండటం మంచిది. నాకైతే ఇప్పటివరకు అక్కడ ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. కానీ.. ఇది చాలా ఇంపార్టెంట్ టైం. ఒక్కతప్పు చేసినా కెరీర్ మొత్తం ఫినిష్ అవుతుంది.అందువల్ల ఒలిం పిక్స్ వరకు ఇంటి నుం చేసాయ్ కేంద్రానికి వెళ్లి రావటం బెటరని నాఫీలిం గ్ . ఇది లాంగ్ టర్మ్​ ప్లాన్ కాదు.ప్రస్తుతం ఆ సెంటర్ లో ఉంటున్న ఏ రెజ్లర్ కీ ఏప్రాబ్లమూ రాకూడదని కోరుకుంటున్నా .– బజరంగ్ పూనియా

భజరంగ్ ‘భళీ’ అనిపించే విజయాలు ..

గతంలో వివిధ వరల్డ్​ ఛాంపియన్ షిప్స్​లో సిల్వర్ మెడల్స్​తోనేసరిపెట్టుకున్న భజరంగ్ పూనియా 2018లో మాత్రం పలు మరపురాని విజయాలను సొంతం చేసుకున్నా రు. కామన్వెల్త్​, ఏషియన్గేమ్స్​తోపాటు మూడు యునైటెడ్ వరల్డ్​ రెజ్లిం గ్ ర్యాంకిం గ్ టోర్నమెంట్లలో స్వర్ణ పతకాల ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీం తో65 కేజీల విభాగంలో వరల్డ్​ టాప్ ర్యాంక్ సాధించాడు. వరల్డ్​ ఛాంపియన్ షిప్స్​లో రెండు మెడల్స్​ పొం దిన తొలి ఇండియన్రెజ్లర్ గా రికార్డు సృష్టిం చి సీజన్ ని ఘనంగా ముగిం చాడు. జనవరిలో జరిగిన ప్రొ–రెజ్లిం గ్ లీగ్ లో ఓటమి ఎరుగని ధీరుడిలానిలిచాడు. తర్వాత.. జర్మన్ రెజ్లిం గ్ లీగ్ లోనూ ఇవే ఫలితాలనునమోదు చేశాడు.