Bhagavanth kesari twitter review: రూటు మార్చిన అనిల్.. భగవంత్ కేసరి ఎలా ఉంది? బాలయ్య హ్యాట్రిక్ కొట్టాడా?

Bhagavanth kesari twitter review: రూటు మార్చిన అనిల్.. భగవంత్ కేసరి ఎలా ఉంది? బాలయ్య హ్యాట్రిక్ కొట్టాడా?

నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా వచ్చిన లేటెస్ట్‌ మూవీ భగవంత్‌ కేసరి(Bhagavanth kesari). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి(Anil ravipudi) తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ మూవీలో కాజల్‌ అగర్వాల్‌(Kajal agarwal) హీరోయిన్‌ గా నటించగా.. లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) బాలయ్య కూతురి పాత్రలో కనిపించింది. సాంగ్స్ అండ్ ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులే కాదు.. సినీ ప్రేక్షకులు కూడా ఈగర్ గావెయిట్ చేశారు. ఈ సినిమా నేడు(అక్టోబర్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు.. పలు చోట్ల షో పడిపోయాయి. సినిమా చూసిన ఆడియన్స్ సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. మరి సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది? బాలయ్య, అనిల్ కాంబో గురించి ఆడియన్స్ ఎం అనుకుంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read :- అలా నిన్ను చేరి మూవీ

బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. బాలయ్య చాలా కాలం తరువాత కొత్తగా చూపించినప్పటికీ.. కథ, కథనాలు ఫ్లాట్‌గా ఉందటంతో ఆడియన్స్ ఎగ్జైట్ అవలేరు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మరో కీ రోల్ లో కనిపించిన శ్రీలీల తన పెరఫార్మన్స్ తో ఆకట్టుకుందని చెబుతున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమా అవనుందని అంటున్నారు. ఇక కాజల్ ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఏమీ లేదని అంటున్నారు.

ఇక తమన్ అందించిన పాటలు పరవాలేదని, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం లిస్ట్ లెవల్లో ఉందని చెప్తున్నారు. అయితే తమన్ మ్యూజిక్ ఎంత బాగున్నా.. దానికి తగ్గ సీన్స్ లేకపోవడంతో అది కూడా తేలిపోయిందని అంటున్నారు. మొత్తంగా అఖండ, వీరసింహా రెడ్డి తరువాత హ్యాట్రిక్ ఇస్తాడనుకున్న బాలయ్య కాస్త డిజప్పాయింట్ చేశాడని అంటున్నారు ఆడియన్స్.