అందానికి అరటిపండు

అందానికి అరటిపండు

అరటిపండు తినడం ఈజీ. అంతేకాదు అరటిపండుతో అందాన్ని పెంచుకోవడం కూడా ఈజీనే. చర్మం, వెంట్రుకల్ని హెల్దీగా ఉంచే  పొటాషియం, విటమిన్​–సి, బి6 విటమిన్లు అరటిపండులో ఉంటాయి. అంతేకాకుండా  చర్మాన్ని బిగుతుగా చేసి యంగ్​గా కనిపించేలా చేస్తుంది కూడా. పొడి జుట్టు సమస్య ఉన్నవాళ్లు అరటిపండు ప్యాక్​ని జుట్టుకి పట్టించాలి. అరటిపండు గుజ్జుకి కొంచెం పెరుగు, గ్లిజరిన్​ లేదా తేనె కలిపి హెయిర్​ ప్యాక్​ వేసుకోవాలి. అరగంట తర్వాత నీళ్లతో కడిగితే  జుట్టు ఫ్రెష్​గా కనిపిస్తుంది.   అరటి తొక్కతో ముఖంపై రుద్దుకుంటే చర్మం కాంతివంతంగా అవుతుంది. ముడతలు 
మరుగునపడతాయి.