దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ దళిత పథకాలు తెస్తుండు

దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ దళిత పథకాలు తెస్తుండు

రాష్ట్రంలో SCలను బీజేపీ ఓటు బ్యాంకుగా చూడటంలేదన్నారు పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలోని 19 SC నియోజకవర్గాల్లో ప్రజలు TRSను వ్యతిరేకిస్తున్నారన్నారు సంజయ్. మిషన్ 19 తో ముందుకు వెళ్తామన్నారు. .దళితుల ఓటు బ్యాంకు తమకే అని కాంగ్రెస్ భ్రమ పడుతుందన్నారు. లోక్ సభలో ఉన్న దళిత నియోజకవర్గాల్లో బీజేపీ 46 గెల్చుకుంటే... కాంగ్రెస్ 5 మాత్రమె గెలిచిందన్నారు. 

దళితుల ఓట్ల కోసమే KCR దళిత పథకాలు తెస్తున్నారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. డబ్బులతో దళితుల ఓట్లు కొనోచ్చులే అనుకున్న కేసీఆర్ కు...హుజూరాబాద్ ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే..ఇప్పటికే ఆర్థికంగా బలోపేతం అయ్యే వారన్నారు. SC నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమాజిగూడ కత్రియ హోటల్ లో జరుగుతున్న SC నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశంలో నేతలు మాట్లాడారు. 

నోటీసులిచ్చినా సాయిధరమ్ తేజ్ స్పందించలేదు

త్వరలో అందుబాటులోకి రెండు కొత్త టీకాలు