మళ్లీ.. నా గెలుపు ఖాయమని కేసీఆర్ సర్వేలే చెబుతున్నయ్: బండి సంజయ్

 మళ్లీ..  నా  గెలుపు ఖాయమని కేసీఆర్ సర్వేలే చెబుతున్నయ్: బండి సంజయ్

వచ్చే ఎన్నికల్లో  మళ్లీ..  తన  గెలుపు ఖాయమని కేసీఆర్ సర్వేలే చెబుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లినగర్ లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన యువకులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి బండి సంజయ్ కమలం కండువా కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు. 

అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. హిందుత్వంతోనే తాను గెలిచానని గర్వంగా చెబుతున్నానని అన్నారు. పాతబస్తీలో సభ పెడితే తన భార్యను చంపుతానని బెదిరించినా.. తాను భయపడలేదని..  వేలాదిమందితో సభ పెట్టి కాషాయ జెండా సత్తా చాటానని చెప్పారు. 

బీజేపీ భయంతో తోకముడిచిన పిరికిపందలు కేసీఆర్, ఒవైసీ అని ఫైర్ అయ్యారు. బీజేపీకి భయపడి ఎంఐఎం పాతబస్తీలోని 9 సీట్లకే పోటీ చేస్తోందని.. బీఆర్ఎస్ ను గెలిపించేందుకు మజ్లిస్ తంటాలు పడుతోందని ఆరోపించారు. మామా అంటూ..  వావివరసలు కూడా మార్చేసిన నాయకుడు ఒవైసీ అని, మామ సంగతి చూస్తాం... అల్లుడి సంగతి చూస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమానికి కర్నాటక ఎమ్మెల్సీ, ఎన్నికల జోనల్ ఇంఛార్జ్ కేశవ ప్రసాద్, కర్నాటక ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా ఎన్నికల ఇంచార్జ్ మానప్ప ఒజ్జూర్ లతోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.