నైజీరియాలో సైన్యంపై బందిపోట్ల దాడి

నైజీరియాలో సైన్యంపై బందిపోట్ల దాడి

కనో: నైజీరియాలో భద్రతా బలగాలపై బందిపోట్లు దాడిచేయడంతో 26మంది సైనికులు మృతిచెందారు. సెంట్రల్​ నైజీరియాలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆర్మీపై బందిపోట్లు మెరుపుదాడి చేశారు. బందిపోట్ల దాడిలో  26మంది చనిపోగా మరో ఎనిమిది మంది సోల్జర్లు తీవ్రంగా గాయపడ్డారని మిలిటరీ అధికారులు తెలిపారు. గాయపడినవారిని రక్షించేందుకు వెళ్లిన హెలికాప్టర్​ను సైతం క్రిమినల్ గ్రూప్స్ సోమవారం కూల్చివేశాయి. హెలికాప్టర్ లో ఉన్న సిబ్బంది, ప్యాసింజర్ల వివరాలు ఎయిర్​ఫోర్స్ అధికారులు వెల్లడించలేదు.  బందిపోట్ల దాడికి సంబంధించిన వివరాలను మిలిటరీ అధికారులు మీడియాకు వెల్లడించారు. బందిపోట్ల దాడిలో ముగ్గురు అధికారులతో సహా 23మంది సోల్జర్లను తాము కోల్పోయామన్నారు. బందిపోట్లు కూడా చాలామంది మరణించారని చెప్పారు. 11మంది సోల్జర్ల డెడ్​బాడీలు, గాయపడిన ఏడుగురిని తరలిస్తున్న ఎయిర్​ఫోర్స్​హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయని, బందిపోట్లు జరిగిన కాల్పుల్లో హెలికాప్టర్​కూలిపోయిందని మిలిటరీ ఆఫీసర్​ తెలిపారు. 

హెలికాప్టర్ శకలాలు గుర్తింపు

జుంగేరు నుంచి టేకాఫ్​ తీసుకున్న ఎంఐ–171 హెలికాప్టర్ ​కూలిపోయిందని నైజీరియా ఎయిర్​ఫోర్స్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. షిరోరో లోకల్​గవర్న మెంట్ ఏరియా చుకుబా గ్రామం సమీపంలో కూలిపోయిన హెలికాప్టర్​ను గుర్తించామని అధికార తెలిపారు.  గ్రామాలపై పడి దోచుకుంటరు..  ఆఫ్రికాలో అత్యధిక జనాభా ఉన్న నైజిరీయా దేశంలో నార్త్​వెస్ట్, సెంటర్ నైజీరియాలో బందిపోట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. బందిపోట్లుగా పిలిచే క్రిమినల్​గ్యాంగ్ లు నైజిర్, కదున, జాంఫర, కట్సినా స్టేట్స్​లో భారీ సంఖ్యలో ఉన్నాయి.  స్కూలు విద్యార్థులను కిడ్నాప్​ చేయడం, అటవీ ప్రాంతాల్లో భారీ క్యాంప్​లు నిర్వహించడంతో ఈ గ్యాంగ్ లు గుర్తింపు  పొందాయి. ఈ బందిపోటు ముఠాల సభ్యులు మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలపై దాడి చేసి గ్రామస్తులను విచ్చలవిడిగా హత్యలు, కిడ్నాప్ లు చేస్తూ దోపిడీలకు పాల్పడుతుంటారు. దోచుకున్న  అనంతరం ఇండ్లను కూడా  తగులబెడుతుంటారు.