ODI World Cup 2023: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న బంగ్లాదేశ్.. శ్రీలంకకు సెమీస్ అవకాశం ఉందా..?

ODI World Cup 2023: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న బంగ్లాదేశ్.. శ్రీలంకకు సెమీస్ అవకాశం ఉందా..?

వరల్డ్ కప్ లో నేడు (నవంబర్ 6) బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో  బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో బంగ్లా ఇప్పటికే సెమీస్ అవకాశాలు కోల్పోగా.. లంకకు  మాత్రం ఇంకా సెమీస్ అవకాశాలు మిగిలే ఉన్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ తమ చివరి మ్యాచ్ ల్లో ఓడిపోయి మిగిలిన రెండు మ్యాచ్ ల్లో శ్రీలంక భారీ తేడాతో గెలిస్తే సెమీస్ కు చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో  లంక ఎలా ఆడుతుందో చూడాలి. 
  
శ్రీలంక (ప్లేయింగ్ XI): 

పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(w/c), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, కసున్ రజిత, దిల్షన్ మధుశంక

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):

తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, షకీబ్ అల్ హసన్(c), తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం