బ్యాంక్​ జాబ్స్​ కామన్​ ప్రిపరేషన్​

బ్యాంక్​ జాబ్స్​ కామన్​ ప్రిపరేషన్​

కరోనా టైమ్‌లో  నోటిఫికేషన్స్​ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బ్యాంక్​ జాబ్స్​ మంచి అవకాశంగా మారాయి. ఐబీపీఎస్​ విడుదల చేసిన ఆర్​ఆర్​బీ అసిస్టెంట్​, ఆఫీసర్ పోస్టులతో పాటు త్వరలో రానున్న క్లర్క్​ నోటిఫికేషన్​లో సేమ్​ సిలబస్​ ​ఉంది. ఈ జాబ్స్​ను కామన్​ ప్రిపరేషన్​తో ఎలా క్రాక్​ చేయాలో ఈ వారం తెలుసుకుందాం. 

ఐబీపీఎస్​ రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో మల్టీపర్పస్‌ జాబ్స్‌, క్లర్క్​ ఉద్యోగాలకు దాదాపు ఒకే సిలబస్‌ ఉంటుంది. కామన్‌ స్టడీ ప్లాన్‌ ఫాలో అయితే రెండు నోటిఫికేషన్లను అటెండ్‌ చేసి బ్యాంక్‌ జాబ్‌ కొట్టొచ్చు. పోస్టును బట్టి ప్రశ్నలు అడిగే స్థాయి మారుతూ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ప్రిలిమ్స్​, మెయిన్స్​ పరీక్షల్లో రీజనింగ్​, న్యూమరికల్​ ఎబిలిటి, ఇంగ్లిష్​, జనరల్​ అవేర్​నెస్​, కంప్యూటర్​ నాలెడ్జ్​ కామన్​  సబ్జెక్టులు. వీటిలోని ముఖ్యమైన టాపిక్స్​ మీద ఫోకస్​ చేయాలి.

ఆర్​ఆర్​బీ అసిస్టెంట్​, ఆఫీసర్​ పోస్టులు
ఆర్​ఆర్​బీ అసిస్టెంట్​, ఆఫీసర్​ గ్రేడ్​ ప్రిలిమ్స్​ పరీక్షలో రీజనింగ్​, న్యూమరికల్​ ఎబిలిటి నుంచి 80 ప్రశ్నలకు 80 మార్కులు ఉంటాయి. మెయిన్స్​లో రీజనింగ్, న్యూమరికల్​ ఎబిలిటి, ఇంగ్లిష్​, జనరల్​ అవేర్​నెస్, కంప్యూటర్​ నాలెడ్జ్​ నుంచి 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉండగా రెండు గంటల సమయం కేటాయిస్తారు. అసిస్టెంట్​ ఉద్యోగాలకు కేవలం రాతపరీక్ష మాత్రమే ఉంటుంది. ఆఫీసర్​ గ్రేడ్​ జాబ్స్​కు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.

ఐబీఎస్​ క్లర్క్
త్వరలో రానున్న ఐబీపీఎస్​ క్లర్క్​ నోటిఫికేషన్​లో 3000కు పైగా పోస్టులు ఉండే అవకాశం ఉంది. దీనికి ప్రిలిమ్స్​ ఎగ్జామ్​ ఆగస్టులో, మెయిన్స్​ అక్టోబర్​లో నిర్వహించనున్నట్లు ఐబీపీఎస్​ విడుదల చేసిన క్యాలెండర్​లో తెలిపారు. ప్రిలిమ్స్​లో ఇంగ్లిష్, న్యూమరికల్​ ఎబిలిటి, రీజనింగ్​ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉండగా గంట సమయం కేటాయిస్తారు. మెయిన్స్​లో రీజనింగ్​, ఆప్టిట్యూడ్​, ఇంగ్లిష్, జనరల్​ అవేర్​నెస్​ నుంచి 190 ప్రశ్నలకు 200 మార్కులకు ఉంటుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు, నెగెటివ్​ మార్క్స్​ ఉంటాయి. 

మాక్​ టెస్టులపై ఫోకస్
బ్యాంక్ పరీక్షలో కీలకమైన అంశం టైమ్​ మేనేజ్​మెంట్. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మాక్​ టెస్టులు, ప్రీవియస్​ పేపర్స్​ ఎక్కువగా ప్రాక్టీస్​ చేయాలి. దీంతో ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలియడంతో పాటు ఏ టాపిక్స్​ మీద ప్రశ్నలు ఎలా అడుగుతున్నారో అవగాహన వస్తుంది.  ప్రతి రోజు న్యూస్‌ పేపర్‌ చదవడంతో కరెంట్‌ ఎఫైర్స్‌ మీద పట్టు పెంచుకోవచ్చు. సరైన ప్రణాళికతో కామన్​ సబ్జెక్టులపై ఫోకస్​ చేస్తూ ప్రిపరేషన్ కొనసాగిస్తే బ్యాంక్​ జాబ్​ ఈజీగా కొట్టొచ్చు.  

సేమ్​ సిలబస్​
ఐబీపీఎస్​ ఆర్​ఆర్​బీ, క్లర్క్​ పోస్టుల్లో కామన్​గా ఉన్న రీజనింగ్​, ఆప్టిట్యూడ్​, ఇంగ్లిష్​, జనరల్​ అవేర్​నెస్​ మీద ఫోకస్​ చేస్తే రెండు పరీక్షల్లో విజయం సాధించవచ్చు. ముఖ్యంగా రీజనింగ్​ సంబంధించి బేసిక్​ అంశాలైన వర్గాలు, ఘనాలు, టేబుల్స్​, ఆంగ్ల అక్షరమాలపై పట్టు పెంచుకోవాలి. కోడింగ్​–డీకోడింగ్, బ్లడ్​ రిలేషన్స్​, డైరెక్షన్స్​, ర్యాంకింగ్​ అంశాలు ఎక్కువ ప్రాక్టీస్​ చేయాలి. న్యూమరికల్​ ఎబిలిటి నుంచి సింప్లిఫికేషన్స్​, డాటా ఎనాలసిస్​, డాటా సఫీషియన్సీ, శాతాలు, లాభ–నష్టాలు, కాలం–పని, కాలం–దూరం, వైశాల్యాలు, ఘనపరిమాణం టాపిక్స్​ మీద ఫోకస్​ చేయాలి. జనరల్​ అవేర్​నెస్​లో భాగంగా కరెంట్​ ఎఫైర్స్​ చదవాలి. పదో తరగతి స్థాయిలో ఇంగ్లిష్ గ్రామర్​ ప్రాక్టీస్​ చేయాలి. 

జి. ప్రశాంత్​ రెడ్డి, రామానుజన్​ అకాడమీ వరంగల్