
70 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు ఆఫర్
సర్వీసు ఏజెంట్ ద్వారా అందుబాటులోకి
మొబైల్ యాప్, కాల్ సెంటర్ ద్వారా రిజిస్ట్రేషన్ ఐపీఓ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో బ్యాంక్‌లకు రాలేకపోతున్న ప్రజల కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే ఈ సర్వీసులను లాంఛ్ చేశారు. ఇంటి వద్దకే బ్యాంకింగ్ సర్వీసులను 70 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు అందజేయనున్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు తెలిపాయి. ఇంటి వద్దకే బ్యాంకింగ్ సర్వీసులను కస్టమర్లు తమ బ్యాంక్ మొబైల్ యాప్, వెబ్‌సైట్, కాల్ సెంటర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ సర్వీసులను పొందడం కోసం అప్లికేషన్ ఫామ్‌ను నింపాల్సి ఉంటుంది. బ్యాంక్ బ్రాంచ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఎస్‌ఎంఎస్ ఫెసిలిటీని యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు కన్‌ఫర్మేషన్ ఎస్‌ఎంఎస్ వస్తుంది. అక్టోబర్ నుంచి అన్ని బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్స్ ఈ సర్వీసు రిక్వెస్ట్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇంటి వద్దకే బ్యాంకింగ్ సర్వీసుల కోసం ఎస్‌బీఐ టోల్‌ఫ్రీ నెంబర్‌కు మీరు కాల్ చేస్తే.. మీ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ నెంబర్ వెరిఫికేషన్ కోసం అకౌంట్ నెంబర్లోని చివరి నాలుగు అంకెలు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ కాల్ కాంటాక్ట్ సెంటర్ ఏజెంట్‌కు ఫార్వర్డ్ చేస్తారు. బ్యాంక్ వర్కింగ్ డేస్‌లో మీ సర్వీసు డెలివరీ టైమ్‌ను మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి సర్వీసు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాక, కేసు ఐడీ, రిక్వెస్ట్ టైప్ వంటివి మీకు ఎస్‌ఎంఎస్ రూపంలో పంపిస్తారు.
ఇంటి వద్దకే బ్యాంకింగ్..
నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌లో చెక్‌లను పిక్ చేసుకోవడం, డిమాండ్ డ్రాఫ్ట్‌లు అందించడం వంటివి ఉన్నాయి. అకౌంట్ స్టేట్‌మెంట్లను అడగవచ్చు. కొత్త చెక్ బుక్ స్లిప్స్‌ను కోరవచ్చు. మీ టర్మ్ డిపాజిట్ రిసీట్ కూడా పొందవచ్చు. 15జీ, 15 హెచ్ ఫామ్‌లను సబ్‌మిట్ చేయొచ్చు. పైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌లో క్యాష్‌ను డిపాజిట్ చేయడం, విత్‌డ్రాయల్ చేయడం వంటివి చేసుకోవచ్చు. ఒకే కాల్‌లో రెండు సర్వీసు రిక్వెస్ట్‌లను కూడా బ్యాంక్‌ను కోరవచ్చు. రిజిస్టర్డ్ అడ్రస్‌కు మాత్రమే ఇంటివద్దకే బ్యాంకింగ్ సర్వీసులను ఆఫర్ చేస్తారు.
సర్వీస్ ఛార్జీలు..
ఎస్‌బీఐ ఫైనాన్షియల్ లేదా నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం ఒక విజిట్ చేస్తే రూ.75 ప్లస్ జీఎస్టీని ఛార్జీలుగా విధిస్తోంది. అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కో విజిట్‌కు రూ.200 ప్లస్ జీఎస్టీని వేస్తోంది. ఇంటివద్దకు వచ్చిన బ్యాంకింగ్ ఏజెంట్‌కు మీ సర్వీసెస్ పేమెంట్ ఇవ్వకపోతే, సర్వీసు రిక్వెస్ట్ పూర్తయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నుంచి సర్వీసు ఛార్జీలను డెబిట్ చేస్తారు. ఈ సర్వీసులను పొందేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్‌లో ఏదైనా మోసపూరిత లావాదేవీ జరిగితే మీరు వెంటనే బ్యాంక్ టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి కంప్లయింట్ ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీసు రిక్వెస్ట్‌లో టోల్ ఫ్రీ నెంబర్‌ను ఇస్తారు. లేదా బ్యాంక్ హోమ్ బ్రాంచ్‌లో కంప్లయింట్‌ను రిజిస్టర్ చేయొచ్చు.
బ్యాంక్ ఏజెంట్ అసలైన వ్యక్తా? కాదా? గుర్తించడమెలా..?
ఇంటివద్దకు వచ్చే సర్వీసు ఏజెంట్‌ను మీ సర్వీస్ కోడ్‌తో వ్యక్తిగతంగా వెరిఫై చేసుకోవచ్చు. ఎస్‌ఎంఎస్ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు సర్వీసు కోడ్, కేసు ఐడీని బ్యాంక్‌లు పంపిస్తాయి. మీ సర్వీసు కోడ్, కేసు ఐడీ వచ్చిన ఏజెంట్‌తో మ్యాచ్ అయితే ఈ సర్వీసు రిక్వెస్ట్‌ను కొనసాగించవచ్చు. మీ అకౌంట్ నెంబర్‌ను, అకౌంట్‌ను, ఏటీఎం కార్డు, పిన్ వివరాలను సర్వీసు ఏజెంట్‌తో పంచుకోవాల్సినవసరం లేదు. మీ ఐడెంటీ డాక్యుమెంట్లను వెరిఫికేషన్ కోసం సర్వీసు ఏజెంట్ అడుగుతారు. దాని కోసం మీరు ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటీ కార్డులలో ఏదో ఒకటి డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, ఆధార్ వంటి వాటిని చూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఫామ్‌లను, చెక్ లేదా క్యాష్‌ను సర్వీసు ఏజెంట్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీసు రిక్వెస్ట్‌ను కూడా ఏజెంట్ తన మొబైల్ యాప్ ద్వారా చెక్ చేసి, వెరిఫై అయితే కొనసాగిస్తాడు. మీరు ఇచ్చిన చెక్‌ను లేదా క్యాష్‌ను ఒక ఎన్వెలప్‌లో పెట్టి, మీ ముందే సర్వీసు ఏజెంట్ సీల్ చేస్తాడు.
ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌పై పరిమితి ఉందా..?
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద మీకు అకౌంట్ ఉంటే, క్యాష్ డిపాజిట్ లేదా విత్‌డ్రాయల్ మినిమమ్ పరిమితి రూ.5 వేలుగా ఉంది. గరిష్టంగా రూ.25 వేల వరకు డిపాజిట్ లేదా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్‌బీఐ వద్ద మీ అకౌంట్ ఉంటే మినిమమ్ డిపాజిట్ లేదా విత్‌డ్రాయల్ పరిమితి వెయ్యి రూపాయలుగా, గరిష్ట పరిమితి రూ.20 వేలుగా ఉంది. క్యాష్ విత్‌డ్రాయల్ రిక్వెస్ట్‌ను పెట్టుకునే ముందే మీ అకౌంట్‌లో సరిపడ బ్యాలెన్స్ ఉండాలి. మీ అకౌంట్‌లో సరిపడ ఫండ్స్ లేకపోతే, మీ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అవుతుంది.
For More News..