నవంబరులో బ్యాంకులకు 10 రోజులు సెలవులు

నవంబరులో బ్యాంకులకు 10 రోజులు సెలవులు

నవంబర్ నెలలో బ్యాంకులకు దాదాపు 10 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ సెలవుల్లో నాలుగు ఆదివారాలతో పాటు రెండో, నాలుగో శనివారాలు  ఉన్నాయి. బ్యాంకు సెలవులు అనేవి ఆయా రాష్ట్రాల్లో జరుపుకునే పండుగల ఆధారంగా మారుతూ ఉంటాయి.  

నవంబర్ లో బ్యాంక్ సెలవులు ఇవే 

  • నవంబర్ 1న కన్నడ రాజ్యోత్సవం... బెంగళూరు, ఇంఫాల్ లో బ్యాంకులకు సెలవు
  • నవంబర్ 6: మొదటి ఆదివారం
  • నవంబర్ 8న గురు నానక్ జయంతి, కార్తీక పూర్ణిమ ఉంది. ఈ రోజున అగర్తలా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, గువాహతి, ఇంపాల్, కొచ్చి, పనాజి, షిల్లాంగ్, తిరువనంతపురం వంటి ప్రాంతాల్లో సెలవు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సెలవు ఉంది.
  • నవంబర్ 11 – కనకదాస జయంతి.. బెంగళూరు, షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు
  • నవంబర్ 12: రెండో శనివారం
  • నవంబర్ 13: రెండో ఆదివారం
  • నవంబర్ 20: మూడో ఆదివారం
  • నవంబర్‌ 23 – సేంగ్‌ పండగ (షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు)
  • నవంబర్ 26: నాలుగో శనివారం
  • నవంబర్ 27: నాలుగో ఆదివారం

 బ్యాంకులు మూసివేయబడినప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ , UPI వంటి సౌకర్యాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.