మూడో టీ20కి కోహ్లీ, పంత్ దూరం

మూడో టీ20కి కోహ్లీ, పంత్ దూరం

న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ 10 రోజుల బ్రేక్ ఇచ్చింది. బయో బబుల్ నుంచి విరామం ఇవ్వడంతో.. ఈ మాజీ భారత సారథి వెస్టిండీస్ తో మూడో టీ20కి ముందే ఇంటికి పయనమయ్యాడు. దీంతో కోల్ కతాలో విండీస్ తో జరిగే చివరి టీ20 మ్యాచ్ కు కింగ్ కోహ్లీ దూరం కానున్నాడు. అలాగే వచ్చే వారం శ్రీలంకతో జరగనున్న మూడు టీ20ల సిరీస్ లోనూ అతడు ఆడే అవకాశం లేదు. దీనిపై ఓ బీసీసీఐ అధికారి స్పందిస్తూ.. ‘ఇండియా సిరీస్ నెగ్గడంతో కోహ్లీ ఇంటికి బయల్దేరాడు. అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ గా ఆడే ప్లేయర్లపై వర్క్ లోడ్ పడకుండా, వారి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంచేందుకు గానూ.. వారికి బయో బబుల్ నుంచి దశల వారీగా విరామం ఇవ్వాలనేది బీసీసీఐ తీసుకున్న నిర్ణయం’ అని చెప్పారు.

కోహ్లీతోపాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూ బీసీసీఐ పది రోజుల పాటు రెస్ట్ ఇచ్చింది. దీంతో అతడు కూడా విండీస్ తో చివరి టీ20 ఆడే అవకాశం లేదు. అలాగే శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కూ అతడు పాల్గొనే ఛాన్స్ లేదు. కాగా, విండీస్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో కోహ్లీ, పంత్ రాణించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత ఛేజింగ్ కు దిగిన విండీస్.. లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. భారత్ 9 పరుగుల తేడాతో మ్యాచ్ తోపాటు సిరీస్ ను కైవసం చేసుకుంది. 

మరిన్ని వార్తల కోసం:

కె.విశ్వనాథ్కు మెగాస్టార్ బర్త్ డే విషెస్

సిక్కు గురువులకు ప్రధాని ఆతిథ్యం

ఫేక్ డాక్యుమెంట్లతో డిజిటల్ లోన్లు