నీతా అంబానీకి బీసీసీఐ నోటీసులు

నీతా అంబానీకి బీసీసీఐ నోటీసులు

ఐపీఎల్లో విజయవంతమైన జట్టు అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ముంబై ఇండియన్స్ ఏ జట్టుకు సాధ్యం కానీ రీతిలో ముంబై ..ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ దక్కించుకుంది. అయితే లాస్ సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ఎప్పుడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి..ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఏ ఒక్క ఆటగాడు కూడా సరైన ప్రదర్శన చేయలేదు. దీంతో ఆ జట్టుపై విమర్శలు పెరిగిపోయాయి. 

ఐపీఎల్ 2022లో విఫలమై తీవ్ర విమర్శలెదుర్కొన్న ముంబై ఇండియన్స్ మరో వివాదంలో చిక్కుకుంది.  ముంబై ఇండియన్స్కు బీసీసీసీ నోటీసులు పంపింది. బీసీసీ ఎథిక్స్ కమిటీ ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీకి కొన్ని సూచనలతో కూడిన నోటీసులను ఎథిక్స్ కమిటీ సభయుడు వినీత్ శరణ్ జారీ చేశారు. 

 బీసీసీఐ రూపొందించిన మార్గదర్శకాలను ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ఉల్లంఘించారంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్త బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. కన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఈ ఆరోపణలు చేస్తూ సంజీవ్ గుప్త కంప్లేయింట్ ఇచ్చాడు. సంజీవ్ గుప్త  ఫిర్యాదులో నిజా నిజాలు గమనించిన బీసీసీఐ ఎథిక్స్ కమిటీ సభ్యుడు వినీత్ శరణ్..ఆమెకు నోటీసులు పంపించారు. బీసీసీఐ అండర్ రూల్ 39 (B) కింద నీతా అంబానీకి పంపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సెప్టెంబర్ 2 లోగా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని  నోటీసుల్లో పేర్కొన్నారు. నీతా అంబానీ ఇచ్చే సమాధానం- సంతృప్తికరంగా లేకపోతే ఆమెపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.