రైతులపై తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు

రైతులపై తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు

ములుగు, వెలుగు : వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్తే తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరు రైతులు గాయపడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం..ములుగు జిల్లాలోని ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన రైతులు నూనావతి భాస్కర్, నూనావత్​సాంకి మంగళవారం పొలంలో పని ఉండడంతో వెళ్లారు.

గట్టు వెంబడి నడుచుకుంటూ వెళ్తుండగా చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక రైతులు ఇచ్చిన సమాచారంతో108 సిబ్బంది వారికి ప్రాథమిక చికిత్స చేసి జిల్లా దవాఖానకు తరలించారు.