5 నెలల తర్వాత వర్షాలు..ఎంజాయ్ చేస్తున్న బెంగళూరు ప్రజలు

5 నెలల తర్వాత వర్షాలు..ఎంజాయ్ చేస్తున్న  బెంగళూరు ప్రజలు

బెంగళూరు నగరంలో గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దాదాపు ఐదు నెలల తర్వాత వర్షాలు పడుతుండటంతో వాతావరణంలో మార్పుతో, చల్లదనంతో బెంగళూరు వాసులు ఎంజాయ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులు ఎండ వేడిమి, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ బెంగళూరు వాసులు తాజా వర్షాలతో కొంత ఉపశమనం దొరికింది. వర్షాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

బెంగళూరులో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తు్న్నాయి. ఇంతకాలం ఎండ వేడిమి, ఉక్కపోతతో హడలెత్తిపోయిన బెంగళూరు వాసులకు వర్షాలతో కొంత ఉపశమనం దొరికింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఫొటోలు, వీడియాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

బెంగళూరు నగర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. దక్షిణ బెంగళూరు నగరమంతటా వర్షపడుతోంది. శనివారం సాయంత్రం(ఏప్రిల్ 20) వర్షం కురవడంతో ‘‘ దేవుడు ఆశీర్వ దించాడు ’ అంటూ బెంగళూరు వాసులు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. ఈ సంవత్సరంలో మొదటి వర్షం నగరంలోని బెల్లందూర్ లో కురిసిందని నెటిజన్లు రాశాడు. 

ఇదిలా వుంటే.. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 24 వరకు కర్ణాటక వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) సూచించింది. ధార్వాడ్, కొప్పాల, దావణగెరె, చిత్రదుర్గ, ఉత్తర కన్నడ, రాయచూర్, తుమకూరు, హావేరి, గడగ్, హాసన్,శివమొగ్గ, దక్షిణ కన్నడ, ఉడిపి, కలబురిగి, బాగల్ కోట్, విజయపుర, యాద్గిర్ , బెలగావి జిల్లాల్లో ఏప్రిల్ 21 నుంచి 24 మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ.