బెంగళూరులో మధ్య నిషేధం.. ఖజానాకు 100కోట్లు నష్టం..

బెంగళూరులో మధ్య నిషేధం.. ఖజానాకు 100కోట్లు నష్టం..

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో జూన్ 1నుండి 5వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.ఈ నిషేధం వల్ల కర్ణాటక ప్రభుత్వానికి రోజుకి సుమారు 100కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. జూన్ 4 నుండి మద్యం అమ్మకలకు అనుమతించాలని ఈ లేఖలో ప్రభుత్వాన్ని కోరింది హోటల్స్ అసోసియేషన్.

ముంబై తరహాలోనే కౌంటింగ్ పూర్తైన జూన్ 4వ తేదీ సాయంత్రం నుండి ఆంక్షలు ఎత్తేయాలని, కౌంటింగ్ నాడు సాయంత్రం కౌటింగ్ సెంటర్ కి ఒక కిలోమీటర్ పరిధిలో ఆంక్షలు విధించాలని కోరింది అసోసియేషన్. ఈ లేఖపై ప్రభుత్వం నుండి ఇంకా స్పందన రావాల్సి ఉంది. నెలలో మొదటి వారంలోనే 5రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో బెంగళూరులోని రెస్టారెంట్లు, బార్ల ఓనర్లు ఆందోళన చెందుతున్నారు.