‘భద్రాచలం రోడ్‌‌ - సత్తుపల్లి’ గూడ్స్‌‌ ట్రైన్‌‌ షురూ

‘భద్రాచలం రోడ్‌‌ - సత్తుపల్లి’ గూడ్స్‌‌ ట్రైన్‌‌ షురూ

హైదరాబాద్‌‌, వెలుగు: భద్రాచలం రోడ్‌‌- – సత్తుపల్లి కొత్త రైల్వే లైన్‌‌లో ఫస్ట్‌‌ గూడ్స్‌‌ ట్రైన్‌‌ ప్రారంభమైంది. సత్తుపల్లి నుంచి బొగ్గుతో లోడైన రైలు శనివారం కొత్తగూడెం థర్మల్‌‌ పవర్‌‌ ప్లాంట్‌‌ (కేటీపీజీ)కు రవాణా అయింది. దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో భద్రాచలం రోడ్‌‌ –సత్తుపల్లి లైన్‌‌ ప్రతిష్టాత్మకమైంది. 
సత్తుపల్లిలో ఉన్న సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా కోసం ఎస్సీఆర్‌‌, మెస్సర్స్‌‌ సింగరేణి కాలరీస్‌‌ లిమిటెడ్‌‌ సంయుక్తంగా రైల్వే లైన్‌‌ పనులు చేపట్టారు. భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు రైల్వేలైన్‌‌ పూర్తయింది. మరోవైపు భద్రాచలం– భావన్నపాలెం మధ్య ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది. భావన్నపాలెం నుంచి సత్తుపల్లి వరకు (15 కి.మీ.) పనులే మిగిలున్నాయి. ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. 
భద్రాచలం రోడ్‌‌ – సత్తుపల్లి నూతన రైల్వే లైన్​ 2010–11లో మంజూరైంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.927.94  కోట్లలో  మెస్సర్స్‌‌ సింగరేణి కాలరీస్‌‌ కంపెనీ లిమిటెడ్​కు రూ.618.55 కోట్ల భాగస్వామ్యం ఉంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోని బొగ్గు గనుల ఏరియాలో 54.10 కి.మీ. మేర ఉంటుంది. ఇందులో 3 క్రాసింగ్‌‌ స్టేషన్లు  (కోయగూడెం, చెంద్రుగొండ, భావన్నపాలెం) ఉన్నాయి.

 

ఇవి కూడా చదవండి

2 రోజుల్లో కేరళకు రానున్న రుతుపవనాలు

ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి

శ్రీలంకలో 50 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు