భగవంత్ కేసరి నుంచి ఫస్ట్ సాంగ్‌ రిలీజ్

భగవంత్ కేసరి నుంచి ఫస్ట్ సాంగ్‌ రిలీజ్

గణపతి పాటతో నవరాత్రుల సందడి కాస్త ముందే స్టార్ట్ చేశారు బాలకృష్ణ. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భగవంత్ కేసరి’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌‌‌‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘శంభో శంభో శంభోరే.. లంభోదర ఆయారే.. భోలో గం గం గణపతి బప్ప మోరియారే..’ అని మొదలైన ఈ పాటను తమన్ కంపోజ్ చేయగా.. కరీముల్లా, మనీషా పండ్రంకి పాడారు. 

ALSO READ :అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నుంచి లూసిఫర్ 2 షూటింగ్‌‌‌‌

‘ఛల్ తీసి పక్కనబెట్టు నువ్వు తీన్‌‌‌‌మార్.. మా చిచ్చా వచ్చే కొట్టర కొట్టు సౌ మార్’ అంటూ బాలకృష్ణ, శ్రీలీల జోష్‌‌‌‌గా డాన్స్ చేస్తున్నారు. ‘ఓ దేవ.. నీ ఏన్గు రూపమెంతో గమ్మతి.. మా దేవ, మేం కట్టినాము నీతో సోపతి.. దండమయ్య, రెండు సేతులెత్తి నిన్నే మొక్కితి.. తొండమయ్య, రాకుండా సూడు మాకే ఆపతి..’ అంటూ కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు.

 బాబాయి, అమ్మాయిగా బాలకృష్ణ, శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 19న సినిమా విడుదల కానుంది.