అమృత్ సర్ లో కేజ్రీవాల్ రోడ్ షో

అమృత్ సర్ లో కేజ్రీవాల్ రోడ్ షో

కాసేపట్లో అమృత్ సర్ లో ఆప్ నేత కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించనున్నారు. పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతగా కేజ్రీవాల్ రోడ్ షో ఉంటుందని కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఫుల్ ఫిల్ చేసేలా ఆశీర్వదించాలని గురు సాహేబ్ ను ప్రార్థిస్తామని అన్నారు. అమృత్ సర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేజ్రీవాల్ కు ఘన స్వాగతం పలికారు భగవంత్ మాన్.మరో వైపు ప్రజా ప్రతినిధులకు భద్రత కుదిస్తారా అన్న ప్రశ్నకు భగవంత్ మాన్ సమాధానం ఇచ్చారు. కొంత మంది భద్రత కంటే తమకు ప్రజల భద్రతే ముఖ్యమన్నారు. పోలీసులంటే కేవలం రాజకీయనాయకుల ఇంటి ముందు కాపలా కాసేవారిలాగే చూసేవారని.. ఆ సిస్టమ్ ను పూర్తిగా మారుస్తామన్నారు భగవంత్ మాన్.

మరిన్ని వార్తల కోసం

చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు 

రెండో విడత బడ్జెట్‌‌ సమావేశాల్లో టైమింగ్స్ మార్పు