టీనేజర్లకు వ్యాక్సినేషన్.. కొవాగ్జిన్‎కు మాత్రమే అనుమతి

టీనేజర్లకు వ్యాక్సినేషన్.. కొవాగ్జిన్‎కు మాత్రమే అనుమతి

దేశంలో 15 నుంచి 18 ఏండ్ల మధ్య వయసున్న టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై దాదాపు రెండు వారాలు దాటింది. ఇప్పటికే సుమారు 94 శాతం మంది టీనేజర్లకు ఫస్ట్ డోస్ టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. టీనేజర్లకు కేవలం కొవాగ్జిన్ టీకా వేసేందుకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో అనుమతి లేని వ్యాక్సిన్లను టీనేజర్లకు వేస్తున్నారన్న వార్తలు రావడంతో దానిపై కొవాగ్జిన్ టీకాను తయారు చేసిన భారత్ బయోటెక్ కంపెనీ స్పందించింది. 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకు కొవాగ్జిన్ టీకా మాత్రమే వేయాలని హెల్త్ కేర్ సిబ్బందిని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది.

కొన్ని చోట్ల ఎటువంటి అప్రోవల్ లేని కొవిడ్ వ్యాక్సిన్లను పిల్లలకు వేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, ఈ విషయంలో హెల్త్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భారత్ బయోటెక్ కోరింది. రెండేళ్ల నుంచి 18 ఏండ్ల మధ్య వయసు వారిపై చేసిన క్లినికల్ ట్రయల్స్ సేఫ్టీ డేటా ఆధారంగా కొవాగ్జిన్ ను పిల్లలకు వేసేందుకు అనుమతి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో పిల్లలకు ఇచ్చేందుకు అనుమతి లభించిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఒక్కటేనని చెప్పింది.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణలో తొలి మహిళా వర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజ్

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి హరీశ్ రావు లేఖ

ఇంజినీరింగ్ కాలేజీలో 100 మందికి పైగా కరోనా