భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని మినీరత్న–1 ప్రభుత్వరంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 08.
పోస్టులు: 156.
ట్రేడులు: ఫిట్టర్ 70, ఎలక్ట్రీషియన్ 10, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 30, మెషినిస్ట్ 15, మెషినిస్ట్ గ్రైండర్ 02, మెకానిక్ డిజిల్ 05, మెకానిక్ ఆర్ అండ్ ఏసీ 05, టర్నర్ 15, వెల్డర్ 04.
ఎలిజిబిలిటీ: పదోతరగతి/ ఎస్ఎస్సీ ఉత్తీర్ణతతోపాటు గుర్తింపు పొందిన బోర్డును సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 2025, డిసెంబర్ 08 నాటికి 14 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 24.
లాస్ట్ డేట్: డిసెంబర్ 08.
సెలెక్షన్ ప్రాసెస్: 10వ తరగతి/ ఎస్ఎస్సీ, ఐటీఐలో సాధించిన మార్కులకు సమాన వెయిటేజ్ ఇస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రతి ట్రేడ్‌కు ఒక సాధారణ మెరిట్ జాబితా తయారు చేస్తారు.
పూర్తి వివరాలకు bdl-india.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
