
- ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : పిలాయిపల్లి కాలువ ద్వారా సాధ్యమైనంత త్వరగా సాగునీరు అందిస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం పెద్దగూడెం చానల్ నుంచి జగత్పల్లి, నారాయణగిరి వరకు పిలాయిపల్లి కాల్వను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాల్వ పనులు త్వరగా పూర్తిచేయాలని ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించారు.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పిలాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని కాల్వల మరమ్మతులకు రూ.500 కోట్లు మంజూరు చేయించినట్టు తెలిపారు. టెండరింగ్ పూర్తయి పనులు కూడా జరగుతున్నాయని చెప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.