
సీఎన్ఎన్ సర్వేలో 14 పాయింట్ల లీడ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న డెమొక్రాటిక్ పార్టీ నామినీ జో బిడెన్.. తాజా సర్వేల్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కంటే ముందున్నారు. సీఎన్ఎన్ కోసం ఎస్ఎస్ఆర్ఎస్ జరిపిన సర్వేలో ట్రంప్ కంటే ఎక్కువ లీడ్‌లో ఉన్నారు. దేశవ్యాప్త సర్వేలో ట్రంప్‌కు 41 శాతం ఓట్లు వస్తే.. బిడెన్‌కు 55 శాతం ఓట్లతో మాంచి లీడ్‌లో ఉన్నారు. ట్రంప్ మద్దతుదారుల్లో ప్రతి పది మందిలో ఏడుగురు తిరిగి ట్రంప్‌ను రీఎలెక్ట్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే తాము ట్రంప్ కు మద్దతిస్తున్నాం కాబట్టీ ఆయనకే ఓటు వేస్తామని చెప్పారు. ఇక 27 శాతం మంది బిడెన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. బిడెన్ ఓటర్లలో 37 శాతం మంది మాత్రమే ప్రోబిడెన్ ప్లాన్‌కు ఓకే చెప్పారు. 60 శాతం మంది ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు.