
ప్రమోటర్లకు ఎక్కువ వాటాకు వీలు
ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంకులుగా మారొచ్చు
ఆర్‌బీఐ వర్కింగ్ గ్రూప్ రికమెండేషన్స్
ముంబై: దేశ బ్యాంకింగ్ రంగంలో పెనుమార్పులకు దారితీసేలా రికమెండేషన్స్ చేసింది ఆర్‌బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్.దేశంలో పేరొందిన బడా పారిశ్రామికవేత్తలు, గ్రూప్‌లు బ్యాంకులు పెట్టుకునేందుకు అనుమతించాలని సిఫారసు చేసింది. టాటా, బిర్లాలు, అంబానీ, అదానీలు బ్యాంకులు పెట్టడానికి ఇప్పటిదాకా ఉన్న రూల్స్ ఒప్పుకోవడం లేదు. రూ. 5 వేల కోట్లకు మించి ఆస్తులున్న బడా కార్పొరేట్ గ్రూప్‌లు, బిజినెస్ హౌస్‌లు ప్రైవేటు బ్యాంకులు పెట్టుకోవడానికి అనుమతించేలా వర్కింగ్ గ్రూప్ రికమెండ్ చేసింది. అయితే, ఆ కార్పొరేట్ గ్రూప్ ఆస్తులు లేదా ఆదాయంలో 40 శాతం నాన్–ఫైనాన్షియల్ బిజినెస్ ద్వారా వస్తూ ఉండాలనే నిబంధనను పెట్టనున్నారు.
ప్రైవేటు బ్యాంకులలో ప్రమోటర్లు తమ వాటాను ఎక్కువ కాలం అట్టేపెట్టుకోవడంతోపాటు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు బ్యాంకులుగా మారడానికీ వీలు కల్పించేలా ఈ వర్కింగ్ గ్రూప్ రికమెండేషన్స్ ఉన్నాయి. ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ పీ కే మొహంతి నాయకత్వంలో ఈ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ ఈ ఏడాది జూన్‌లో ఏర్పాటయింది. లైసెన్సింగ్, డీరెగ్యులేషన్, ఓనర్‌షిప్, కంట్రోల్, కార్పొరేట్ స్ట్రక్చర్‌తోపాటు సంబంధిత ఇతర అంశాలను స్టడీ చేయడానికి ఈ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశారు. జూన్‌లో ఏర్పాటయిన వర్కింగ్ గ్రూప్ తన రిపోర్టును ఇటీవల ఆర్‌బీఐకి అందచేసింది.
కీలకమైన రికమెండేషన్స్…
పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, ఇండస్ట్రియల్ హౌస్‌లను బ్యాంకులకు ప్రమోటర్లుగా అనుమతించడం. అయితే, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్, 1949 కు సవరణలు చేసిన తర్వాతే దీనిని అనుమతించాలి. పెద్ద కార్పొరేట్లలో పటిష్టమైన సూపర్వయిజరీ మెకానిజం ఏర్పడేలా మార్పులుండాలి. లాంగ్ టర్మ్‌లో ప్రమోటర్ల వాటాపై పరిమితిని ఇప్పుడున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచడం. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం బ్యాంకు ఓటింగ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 15 ఏళ్ల తర్వాత 15 శాతానికి మించి ప్రమోటర్లకు వాటా ఉండటానికి వీలులేదు.
రూ. 50 వేల కోట్లకు మించి అసెట్స్ ఉన్న నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు బ్యాంకులుగా మారేందుకు వీలు. పదేళ్ల కార్యకలాపాలు పూర్తి చేసుకున్న పెద్ద కార్పొరేట్ సంస్థలకు చెందిన ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంకులుగా మారేందుకు అవకాశం. అన్ని నిబంధనలు పాటిస్తేనే బ్యాంకులుగా మారేందుకు అనుమతించడం.
కొత్తగా పెట్టే ప్రైవేటు బ్యాంకుల కనీస మూలధన పరిమితిని ఇప్పుడున్న రూ. 500 కోట్ల నుంచి రూ. 1,000 కోట్లకు పెంచడం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకయితే ఈ మూలధన పరిమితిని ప్రస్తుతమున్న రూ. 200 కోట్ల నుంచి రూ. 300 కోట్లు చేయడం.
కొత్త లైసెన్స్‌లన్నింటికీ నాన్–ఆపరేటివ్ ఫైనాన్షియల్ షేర్ హోల్డింగ్ కంపెనీ (ఎన్‌ఓఎఫ్‌హెచ్‌సీ) స్ట్రక్చర్ వర్తింపచేయడం. ప్రమోటర్లు లేదా ప్రమోటర్ల గ్రూప్‌కు ఇతర సంస్థలు ఉంటేనే ఈ నిబంధన తప్పనిసరి చేయడం.
ఇప్పుడున్న ప్రైవేటు బ్యాంకుల ప్రమోటర్లలో ఎవరికైనా వేరే గ్రూప్ కంపెనీలు లేకపోతే వారిని ఎన్‌ఓఎఫ్‌హెచ్‌సీ స్ట్రక్చర్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడం.
2013 కంటే ముందు ఏర్పడిన బ్యాంకులైతే కావాలనుకుంటే ఎన్‌ఓఎఫ్‌హెచ్‌సీ స్ట్రక్చర్‌లోకి మారేందుకు అనుమతించడం.
ఎన్‌ఓఎఫ్‌హెచ్‌సీ స్ట్రక్చర్ ఆపరేషనల్‌గా సక్సెసయ్యేంత వరకు సబ్సిడరీలు, జాయింట్ వెంచర్లు, అసోసియేట్స్‌ను సూపర్వయిజ్ చేసేందుకు తగిన రూల్స్ పెట్టడం.
కనీసం మూడేళ్ల అనుభవమున్న పేమెంట్ బ్యాంక్స్ ఎవరైనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా మారాలనుకుంటే అందుకు అనుమతించడం.
ఇప్పటికే ఏర్పాటయిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల లిస్టింగ్ కోసం కూడా కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది ఈ వర్కింగ్ గ్రూప్. రూ. 500 కోట్ల నెట్‌వర్త్ దాటిన ఆరు సంవత్సరాలు లేదా ఆపరేషన్స్ మొదలు పెట్టిన 10 ఏళ్ల లోపు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు లిస్టింగ్ తప్పనిసరి చేయడం.
రికమెండేషన్స్ఇండియాలో ప్రైవేటు బ్యాంకులు పెట్టేందుకు బడా కార్పొరేట్లను అనుమతించాలా వద్దా అనే విషయంలో డైలమా చాలా ఏళ్లుగా ఉంది. ఇప్పుడు అందుకు అనుమతించేలా రూల్స్ మార్చాలని ఆర్‌బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ రికమెండ్ చేసింది. కాకపోతే, ముందుగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ను సవరించాకే బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వాలని పేర్కొంది. ఈ రికమెండేషన్స్ ప్రభావం వ్యవస్థపై ఎక్కువగానే ఉంటుం ది. కాబట్టి, వాటిపై
విస్త్రుతమైన చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాను.
– ఆనంద్ సిన్హా, ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్
For More News..