V6 News

బిహార్‌లో ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిన వంతెన

బిహార్‌లో ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిన వంతెన

బిహార్‌లోని బెగుసరాయ్‌లో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలింది. ప్రభుత్వం గండక్ నదిపై 206 మీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టగా.. ఇందుకోసం రూ.13 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈ వంతెన ముందు భాగం ఆదివారం ఒక్కసారిగా కూలిపోయింది. గోవింద్‌పుర్‌, రాజౌరా వెళ్లే సాహెబ్‌పుర్‌ కమల్‌ బ్లాక్‌లోని బుడీ గండక్‌ నదిపై నిర్మించిన బిష్ణుపుర్‌ అహోక్‌ ఘాట్‌ వంతెనను 2016లో ప్రారంభించి.. 2017లోనే పూర్తి చేశారు. అయితే ఈ వంతెనకు కనెక్టింగ్ రోడ్డు లేకపోవడంతో ఐదేళ్లు గడిచినా ప్రారంభానికి నోచుకోలేదు. 

నాబార్డు పథకం కింద ప్రభుత్వం ఈ వంతెనను నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగినట్టు వార్తలు కూడా వచ్చాయి. రూ.13కోట్లు ఖర్చుతో నిర్మించిన ఈ బ్రిడ్జి వంతెన ముందు భాగంలో ఇటీవలే పగుళ్లు కనిపించాయి. దీంతో ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారులు సంబంధిత శాఖకు లేఖ రాశారు.