ప్రమాదకరంగా మహమ్మారి.. ఒమిక్రాన్తో జాగ్రత్త

ప్రమాదకరంగా మహమ్మారి.. ఒమిక్రాన్తో జాగ్రత్త

న్యూయార్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో దీనిపై సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మహమ్మారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి అసాధారణంగా ఉందని, మహమ్మారి ప్రమాదకర దశలోకి ప్రవేశించవచ్చన్నారు. కాబట్టి అందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. అనవసర ప్రయాణాలు, పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. కరోనా జాగ్రత్తలు పాటించకుంటే తీవ్ర ముప్పు తప్పదని హెచ్చరించారు. 

‘ప్రపంచమంతా సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో మహమ్మారి అత్యంత ప్రమాదకర దశలోకి వెళ్తోంది. ఒమిక్రాన్ తో జాగ్రత్తగా ఉండాలి. అది మన ఇళ్లలోకి రావొచ్చు. నా ఫ్రెండ్స్ లో కొందరికి ఒమిక్రాన్ సోకింది. నేను కూడా నా హాలీడే ప్లాన్స్ రద్దు చేసుకున్నా’ అని బిల్ గేట్స్ అన్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, అయినా వచ్చే ఏడాది మహమ్మారి అంతం అవుతుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు. అయితే దీనికి సరైన చర్యలు, జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని ట్వీట్ చేశారు.  

మరిన్ని వార్తల కోసం: 

డాలర్ల కోసం దేశ ప్రతిష్టను పణంగా పెట్టినం

మాట తప్పింది.. మాట మార్చింది కేంద్రమే

గున్న ఏనుగు గజ గజ