కార్బెవ్యాక్స్ వినియోగానికి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

కార్బెవ్యాక్స్ వినియోగానికి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బయోలాజికల్–ఈ సంస్థ 12 నుంచి 18 ఏళ్ల పిల్లల కోసం మరో కరోనా టీకాను అభివృద్ది చేసింది. కార్బెవ్యాక్స్‌ పేరుతో రూపొందిన ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ ఆ సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని బయోలాజికల్–ఈ లిమిటెడ్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. డీసీజీఐ తమ టీకాకు ఫైనల్ అప్రూవల్ ఇచ్చిందని పేర్కొంది. ఇప్పటికే టీనేజర్లకు టీకాల విషయంలో భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ కు డీసీజీఐ అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కార్బెవ్యాక్స్ కూ అనుమతి దక్కడంతో.. దేశంలో పిల్లల కోసం రెండు టీకాలు అందుబాటులో ఉండనున్నాయి. కాగా, భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ 15 ఏళ్లు పైబడిన వారికే వ్యాక్సిన్లు అందిస్తోంది. 

మరిన్ని వార్తల కోసం:

వాట్సాప్లో కొత్త ఫీచర్ 

బాలయ్య కొత్త లుక్ అదిరింది

హిట్మ్యాన్ కెప్టెన్సీలో భారత్ మరో ఘనత