బర్డ్ ఫ్లూ భయం: రెండ్రోజుల్లో 16 వేల బాతులను చంపేశారు

బర్డ్ ఫ్లూ భయం: రెండ్రోజుల్లో 16 వేల బాతులను చంపేశారు

కొట్టాయం: బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) భయంతో కేరళలో పెద్ద ఎత్తున బాతులను చంపేస్తున్నారు. రాష్ట్రంలోని కొట్టాయం, అలప్పూజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ సోకినట్లు  గుర్తించడంతో.. సామూహికంగా బాతులను చంపేస్తున్నారు. గురువారం ఒక్క రోజే 5,700 బాతులను చంపేసినట్లు స్టేట్ యానిమల్ హజ్బెండరీ శాఖ అధికారులు ప్రకటించారు. 

నిన్నటి వరకు మొత్తంగా 16,976 బాతులను చంపినట్లు చెప్పారు. అలప్పుజాలో రెండ్రోజుల్లో 15,665 బాతులను కిల్లింగ్ చేశారని.. మరో రెండు, మూడ్రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. బర్డ్ ఫ్లూ భయాందోళనల నేపథ్యంలో గుడ్లు, మాంసం, బాతుల పేడ, చికెన్ కొనుగోళ్లపై స్థానిక పాలనా యంత్రాంగం నిషేధం విధించింది. ‘బర్డ్ ఫ్లూ సోకిన బాతులను చంపడం లేదా కాల్చేస్తున్నాం. కల్లారా, వేచూర్ తోపాటు ఐమానంలో బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంది’ అని కొట్టాయం జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ పీకే జయశ్రీ తెలిపారు.  

మరిన్ని వార్తల కోసం: 

నవ్వినా, మందు తాగినా కఠిన చర్యలు!

రైతన్నల సాగుకు జవాన్ల పహారా

భారత్కు కావాల్సింది విప్లవం కాదు.. పరిణామం