ఉత్తరాఖండ్ ఎలక్షన్స్‌: 30 మంది స్టార్‌‌ క్యాంపెయినర్లతో బీజేపీ లిస్ట్

ఉత్తరాఖండ్ ఎలక్షన్స్‌: 30 మంది స్టార్‌‌ క్యాంపెయినర్లతో బీజేపీ లిస్ట్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు తమ శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం హోరా హోరీగా ప్రచారం షురూ చేశాయి. బీజేపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇప్పటికే యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇంటింటి ప్రచారాలు మొదలు పెట్టారు. ఇవాళ తాజాగా బీజేపీ తమ పార్టీ తరఫున ఉత్తరాఖండ్‌లో ప్రచారం చేయబోయే స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌ను ప్రకటించింది.

ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి సహా 30 మంది

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 14న ఎన్నికలు ముగుస్తాయి. కౌంటింగ్ మాత్రం ఐదు రాష్ట్రాలకు ఒకే రోజు మార్చి 10న నిర్వహించనుంది ఈసీ. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ మొత్తం 30 మంది కీలక నేతల పేర్లతో స్టార్‌‌ క్యాంపెయినర్ల లిస్ట్‌ను ప్రకటించింది. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి, ఉత్తరాఖండ్ ఎలక్షన్ ఇన్‌చార్జ్ ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఆ రాష్ట్ర మంత్రి సత్పాల్‌ మహారాజ్ వంటి నేతలను స్టార్‌‌ క్యాంపెయినర్లుగా ప్రకటించింది బీజేపీ.

మరిన్ని వార్తల కోసం..

ఘనంగా బీటింగ్ రిట్రీట్.. అగ్ర దేశాల సరసన భారత్

బీజేపీ నేత హత్య: నిందితుల్ని పట్టిస్తే రూ.2.5 లక్షల నజరానా

ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు!