రజాకార్​ సినిమా.. జరిగిన చరిత్ర

రజాకార్​ సినిమా.. జరిగిన చరిత్ర

హైదరాబాద్, వెలుగు: జరిగిన చరిత్ర ఆధారంగానే రజాకార్​ సినిమాను నిర్మించామని బీజేపీ లీడర్​ గూడురు నారాయణ రెడ్డి అన్నారు. ఒక నిమిషం 40 సెకండ్ల వీడియోను చూసి చిత్రాన్ని బ్యాన్ చేయాలనడం కరెక్ట్ కాదని తెలిపారు. ఈ మేరకు సోమవారం సీఈఓ వికాస్ రాజ్ ను నారాయణ రెడ్డి కలిశారు. 

రజాకార్ సినిమా బ్యాన్ చేయాలని పలువురు సీఈఓ కు చేసిన ఫిర్యాదు చేయడంతో సినిమా నిర్మాతగా ఆయన సీఈఓను కలిసి సినిమాపై క్లారిటీ ఇచ్చారు.  ప్రత్యేకంగా ఒక మతాన్ని ఉద్దేశించి తీసిన సినిమా కాదని తెలిపారు. 1947 నుంచి 1948 వరకు జరిగిన మారణోమం గురించి సినిమాలో చూపిస్తున్నామన్నారు.