బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్టే : భరత్ ప్రసాద్

బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్టే : భరత్ ప్రసాద్

రేవల్లి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్​అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్నర్ మీటింగ్ కు ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, నారాయణ, సబ్బిరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రామన్న తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి: బీజేపీ గెలిచే 400లకు పైగా స్థానాల్లో నాగర్​కర్నూలు ఒకటని భరత్​ప్రసాద్​అన్నారు. పెద్దమందడి మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పారు.