
న్యూఢిల్లీ, వెలుగు: సిద్ధాంతాలను వదిలేసి కమ్యూనిస్టులు దివ్యాంగులుగా మారిపోయారని బీజేపీ నేషనల్ సెక్రటరీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగంలోనే కామ్రేడ్లు పని చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులకు నోటీ సులిస్తే.. ఎప్పుడు విచారించాలో మీ రు ఎలా చెప్తారని ప్రశ్నించారు. ఢిల్లీ లో జరుగుతున్న రెండ్రోజుల పదా ధికారుల మీటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కమ్యూ నిస్టులు దేశంలో, రాష్ట్రంలో ఉనికిని కోల్పోయారని, అందుకే సీపీఐ, సీపీఎం లీడర్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.