బీజేపీ పదాధికారుల సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

బీజేపీ పదాధికారుల సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

ఢిల్లీ : ఢిల్లీలోని  బీజేపీ కేంద్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు జాతీయ, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల సమావేశాలు జరగనున్నాయి. పార్టీ జాతీయ కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జిలు దీనికి హాజరయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలపై ప్రధాన ఫోకస్ తో బీజేపీ ఈ సమావేశాలు నిర్వహిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈసారి అంతకుమించి నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2014, 2019 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ రీతిలో ఓట్లు సాధించని 144 నియోజకవర్గాలను బీజేపీ అధిష్టానం గుర్తించింది. 144 లోక్‌సభ స్థానాలున్న దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. జాతీయ, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల భేటీలో బీజేపీ  చీఫ్ జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించింది. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఇప్పటికే కేంద్ర మంత్రుల బృందాలు పర్యటించాయి.