బీదోళ్లకు బీజేపీ ఏం చేసింది?

బీదోళ్లకు బీజేపీ ఏం చేసింది?

దేశం నుంచి పేదరికాన్ని శాశ్వతంగా తరిమివేయడానికి కాం గ్రెస్ పార్టీ ‘న్యూనతమ్ ఆయ్ యోజన’ (న్యాయ్) పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చిం ది. ఈ పథకం సాయంతో పేదరికంపై యుద్ధా నికి కాం గ్రెస్ రెడీ అయిం ది. ‘న్యాయ్’ గా పాపులర్ అయిన ఈ పథకానికి ప్రజల నుంచి వస్తు న్న ఆదరణ చూసి బీజేపీ లీడర్లు  ఖంగుతిన్నారు. ఈ పథకం అమలు సాధ్యం కాదంటూ దుర్మార్గపు  ప్రచారం మొదలెట్టారు. అయితే ‘న్యాయ్’ పథకాన్ని అంతర్జా తీయ సంస్థలు,  ఆర్థికవేత్తలు ప్రశంసించారు. బీజేపీ నా యకులు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, పేదరికం లేని ఇండియాను నిర్మిం చాలన్న ఏకైక లక్ష్యానికి కాం గ్రెస్ కట్టుబడి ఉంది. కాం గ్రెస్ పార్టీ మొదటి నుంచి రకరకాల సంక్షేమ పథకాలతో పేదరికం పైయుద్ధం చేస్తూనే ఉంది. 1970ల్లో  ఇందిరా గాం ధీ ఇచ్చిన ‘ గరీబీ హటావో ’ నినాదాన్ని కూడా ఈ కోణంలో నుంచే అర్థం చేసుకోవాలి. ‘ గరీబీ హటావో ’ నినాదం కొం తమేరకే విజయవంతమైంది. దేశం నుంచి పేదరికం పూర్తిగా పోలేదు. ఈ నేపథ్యం లోనే కాం గ్రెస్ చీఫ్ రా హుల్ గాం ధీ ‘న్యాయ్’ పథకాన్ని ప్రకటిం చారు. కాం గ్రెస్ పేదవారి వైపు నిలిస్తే  బీజేపీ కేవలం కొం తమంది సంపన్నుల వైపు నిలిచిం ది. పేదరికం పై కాం గ్రెస్  సర్జికల్  స్ట్రైక్స్ చేస్తే  పేదలపై బీజేపీ సర్జికల్  స్ట్రైక్స్ చేస్తోంది.

అదీ తేడా..

సమాజంలో సొమ్ములున్నోళ్లు, పేదల మధ్య అంతరాలు తగ్గించడానికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాం గ్రెస్ చేసిన కృషి అందరికీ తెలిసిందే.బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు, గ్రీన్ రివల్యూషన్, భూసంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ  కాం గ్రెస్ హయాం లో వచ్చినవే. దేశానికి ఇన్ ఫర్మేషన్ టెక్నా లజీని పరిచేయం చేసింది రాజీవ్ గాం ధీయే. బీజేపీ మాత్రం ఈ వాస్తవాలను  అంగీకరిం చదు. కాం గ్రెస్ హయాంలో రవ్వంత అభివృద్ధి కూడా జరగలేదని గోబెల్స్  ప్రచారం చేస్తుంటుంది. ఇందులో భాగంగా అబద్దాలను  ప్రచారం చేసి రా జకీయంగా పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా  దేశభక్తిని నిరూపించుకోవాలనే వాదన తెరపైకి వస్తుంటుంది. అంతేకాదు అంతర్గత భద్రత కూడా ఓ సమస్యగా మారుతుంది. తమ హిందూత్వ పోకడలను ప్రశ్నించిన మేధావులు, రచయితలపై దాడులు చేయిస్తుంది. ప్రశ్నించే గొంతుకలే లేకుండా చేయాలని చూస్తుంది. తాజాగా సైనికుల త్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే దుర్మార్గపు వైఖరికి బీజేపీ ప్రభుత్వం  శ్రీకారం చుట్టింది. పుల్వామా సంఘటనలో ఇంటెలిజెన్స్  ఫెయిల్యూర్ గురించి ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా దాట వేస్తోంది. కిందటేడాది మూడు రాష్ట్రాలు చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ లో కాం గ్రెస్ గెలిచిన వెంటనే రైతు రుణాలు ఆయా ప్రభుత్వాలు మాఫీ చేసిన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. రైతుల పట్ల కాం గ్రెస్ పార్టీకి ఉన్న కమిట్మెంట్ కు ఇంతకంటే వేరే నిదర్శనం అక్కర్లేదు. తాజాగా కాం గ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంది. నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇద్దరూ పైకి ఒకర్నొకరు విమర్శించుకుంటారు.

లోపల ఇద్దరూ ఒకటే. ఈ విషయం తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. టీఆర్ ఎస్, 16 లోక్ సభ సీట్లు గెలుచుకున్నా ఢిల్లీలో చేయడానికి ఏమీ ఉండదు. కేంద్రం లో కాం గ్రెస్ లేదంటే బీజేపీ ప్రభుత్వం వస్తుంది. అటు కాం గ్రెస్ ఇటు బీజేపీ ఇద్దరిలో ఎవరితోనూ జత కట్టకుండా టీఆర్ ఎస్ ఉండగలదా అనే ప్రశ్న లేటెస్ట్ గా తెరమీదకు వచ్చింది. దీనికి టీఆర్ ఎస్ నాయకత్వమే సమాధానం చెప్పా లి. ప్రజా జీవితంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు పార్టీ టికెట్లు ఇచ్చి ప్రజల మీద రుద్దడానికి కేసీఆర్ ప్రయత్నిస్తు న్నారు. ప్రస్తుత పరిస్థితులను  పరిశీలిస్తే  ప్రజాస్వామ్యం  ప్రమాదపుటంచుల్లో ఉన్నదన్న విషయం స్పష్టమవుతోంది. బీజేపీ హయంలో రాజ్యాంగ వ్యవస్థలు ఉనికి కోల్పోయే పరిస్థితులు దాపురించాయి. వీటన్నిటి కీ విరుగుడు కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి రా వడమే. కాం గ్రెస్ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు బేఫికర్ గా ఉండగలవు. ఏ పార్టీ ఎవరి వైపు ఉన్నదో ప్రజలు గమనిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాం గ్రెస్ రుణం తీర్చు కోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

     -ఇందిరా శోభన్, తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి