కరీంనగర్, వెలుగు: డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో ఎన్నికల పోరుకు బీజేపీ సమాయత్తమవుతోంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా సర్పంచ్, వార్డు స్థానాలను కైవసం చేసుకోవమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే గ్రామాల వారీగా అభ్యర్థుల ఎంపికపై సర్వేలు చేయిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఎన్నికలను పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్స్ లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు, సోషల్ మీడియా వారియర్స్ తో విస్త్రతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
