‘కాంగ్రెస్​ ఫైల్స్’​ రిలీజ్​ చేసిన బీజేపీ

‘కాంగ్రెస్​ ఫైల్స్’​ రిలీజ్​ చేసిన బీజేపీ
  • యూపీఏ హయాంలో అవినీతిపై వీడియో సిరీస్​

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై ‘‘కాంగ్రెస్​ ఫైల్స్” పేరుతో సోషల్​ మీడియా వేదికగా బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘‘కాంగ్రెస్​ ఫైల్స్” వీడియో సిరీస్​లోని మొదటి వీడియోను బీజేపీ అధికారిక ట్విట్టర్​ ఖాతాలో  ఆదివారం  పోస్ట్​ చేసింది.  3 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో క్లిప్​లో మన్మోహన్​ సింగ్​ప్రధానిగా ఉన్న టైంలో జరిగిన 2జీ స్కాం, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్​ గేమ్స్​ స్కాంల గురించి ప్రస్తావించారు.  యూపీఏ సర్కారు ఇంచుమించు రూ.4.82 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలకు పాల్పడిందని అందులో ఆరోపించారు. ‘‘గతంలో పెద్దపెద్ద కుంభకోణాలకు పాల్పడిన వాళ్లంతా..  ఇప్పుడు  ఒక్కటవుతున్నరు. వాళ్లంతా కలిసి ‘‘భ్రష్టాచారీ బచావో ఆందోళన్”  మొదలుపెట్టిన్రు. వాళ్లను వాళ్లు కాపాడుకునేందుకే ఈ ప్రయాస”అని మార్చి 28న ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్​ వచ్చిన వారంలోనే బీజేపీ సోషల్​ మీడియా వింగ్​ ‘‘కాంగ్రెస్​ ఫైల్స్”  వీడియో సిరీస్​ను మొదలుపెట్టడం గమనార్హం.