BJP ఎన్నికల మేనిఫెస్టో విడుదల

BJP ఎన్నికల మేనిఫెస్టో విడుదల

ఢిల్లీ: సంకల్ప్ పత్ర్ పేరుతో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ నేతలు రాజ్‌ నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ తదితరులు ‘సంకల్ప్‌ పత్ర ‌’ పేరిట మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.  ఐదేళ్లలో అవినీతి రహిత పాలన అందించామన్నారు పార్టీ నేతలు. ఐదేళ్ల పాలను చూసి..మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు. సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తున్నమన్న నేతలు ..2022వరకు 75లక్ష్యాలను పెట్టుకున్నట్టు చెప్పారు.

2047 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలపటమే లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అందుకు తగ్గట్లుగానే లక్ష్యాలను నిర్దేశించుకుని మేనిఫెస్టో తయారు చేశామన్నారు. మేనిఫెస్టోలో 75 లక్ష్యాలను చేర్చామని చెప్పారు. ఒన్ మిషన్, ఒన్ డైరెక్షన్ లక్ష్యంతో తాము పనిచేస్తున్నామన్నారు. దేశ ప్రజల తక్షణ అవసరాలనే మేనిఫెస్టోలో చేర్చామని చెప్పారు. పేదల జీవితాల్లో మార్పే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మోడీ.

ఎంతో ముందుచూపుతో బీజేపీ మేనిఫెస్టో తయారు చేశామన్నారు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్. మోడీ పాలనలో నవభారత నిర్మాణం వైపు పయనిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించటమే లక్ష్యంగా మేనిఫెస్టో తయారు చేశామని తెలిపారు. ప్రజల తక్షణ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేలా మేనిఫెస్టో రూపొందించామన్నారు రాజ్ నాథ్.