కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ బాధిత రైతులను ఢిల్లీ తీసుకెళ్తా

కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ బాధిత రైతులను ఢిల్లీ తీసుకెళ్తా

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో రైతులు నష్టపోతున్నారన్నారు మాజీఎంపీ వివేక్ వెంకటస్వామి. ఇంజనీరింగ్ వైఫల్యంతోనే పొలాలు మునుగుతున్నాయన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టు రీ డిజైన్ చేయడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్‌తో కొందరి పొలాలు మునిగాయి. బాధిత రైతులంతా 3రోజులుగా దీక్ష చేస్తున్నారు. వీరికి మద్దతు తెలిపారు వివేక్ వెంకటస్వామి. ఎకరాకు 30 లక్షల పరిహారం ఇచ్చి.. ముంపు పొలాలను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత రైతులతో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులకు సమస్య వివరిస్తానన్నారు వివేక్ వెంకటస్వామి.

మరిన్ని వార్తల కోసం..

కేన్సర్​ మందుల​​ పరిశోధనలో తెలంగాణ బిడ్డ

రికార్డు స్థాయిలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

సీతక్కపై కేసీఆర్ సీరియస్.. ఏదిపడితే అది అడగొద్దు