
న్యూఢిల్లీ: ఆప్ మెగా ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ పోస్టర్ క్యాంపెయిన్ చేపట్టింది. సీఎం కేజ్రీవాల్ ఎంత విలాసవంతంగా జీవిస్తున్నారో ప్రజలకు తెలియజేసేందు కు ఆయన ఇంటిని ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. “కేజ్రీవాల్ ఇంటి పునరుద్ధరణకు రూ.45 కోట్ల ఖర్చా.. ఇదంతా నా దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బే గా.. దయచేసి జవాబు చెప్పండి” అని మరో పోస్టర్ పెట్టింది. “తన మహల్‌ను అందరికీ చూపించాల ని మేం సీఎంను అభ్యర్థించాం. ఆయన అంగీకరించక పోవడంతో ఓ మోడల్ తయారు చేశాం. మేం దీనిని ఢిల్లీలోని 70 నియోజకవర్గాలకు తీసుకెళ్తాం. ఆయన ఏర్పాటు చేసుకున్న సౌకర్యాల ను ప్రజలకు చూపిస్తాం” అని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు.