తెలంగాణలో 11 ఎంపీ సీట్లను గెలుస్తాం

తెలంగాణలో 11 ఎంపీ సీట్లను గెలుస్తాం

యాదాద్రి, వెలుగు: తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలను కాంగ్రెస్‌‌ దోచుకుంటోందని కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే, పార్లమెంట్‌‌ ఎన్నికల ఇన్‌‌చార్జి అభయ్‌‌ పాటిల్‌‌ ఆరోపించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌‌ అధికారంలోకి రాగానే దోపిడీకి తెరలేపిందని, తెలంగాణను ఏటీఎంగా మార్చుకుందని విమర్శించారు. మోదీని మరోసారి ప్రధాని చేసేందుకు ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భువనగిరి సహా 11 ఎంపీ సీట్లను గెలుచుకుంటామని, దేశంలో 400 సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

 ప్రతి ఇంటికి మూడుసార్లు వెళ్లి ఓటర్లను కలిసి ఓటు అడగాలని సూచించారు. కేంద్ర పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరినీ కలవాలని చెప్పారు. ఎన్నికల తర్వాత రేవంత్‌‌రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోతారన్నారు. సమావేశంలో పార్లమెంట్‌‌ ఇన్‌‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌‌ఎస్‌‌ ప్రభాకర్‌‌, ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌‌రెడ్డి, క్లస్టర్‌‌ ఇన్‌‌చార్జి కాసం వెంకటేశ్వర్లు. బీజేపీ క్యాండిడేట్‌‌ బూర నర్సయ్య గౌడ్, పార్లమెంట్‌‌ ప్రభారి పాపారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌‌రెడ్డి, యాదాద్రి, నల్గొండ, జనగామ జిల్లాల అధ్యక్షుడు పాశం భాస్కర్, నాగం వర్షిత్‌‌రెడ్డి, దశమంతరెడ్డి పాల్గొన్నారు.