బీజేపీ నేతలపై దాడులు ఆపాలి.. లేకపోతే శ్మశానానికి పంపుతాం

బీజేపీ నేతలపై దాడులు ఆపాలి.. లేకపోతే శ్మశానానికి పంపుతాం

హల్దియా: పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ తృణమూల్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు, నేతలపై తృణమూల్ క్యాడర్ అల్లర్లను కొనసాగిస్తే వారిని శ్మశాన వాటికకు పంపుతామని దిలీప్ హెచ్చరించారు. బెంగాల్‌‌లోని ఈస్ట్ మిడ్నాపోర్ జిల్లా, హల్దియా టౌన్‌‌లో నిర్వహించిన ర్యాలీలో దిలీప్ ఘోష్ పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ నేతల దాడులు కొనసాగడంపై ఆయన సీరియస్ అయ్యారు.

‘ఎవరైతే అల్లర్లకు పాల్పడుతున్నారో వారు 6 నెలల్లోగా తమ తప్పులు తెలుసుకొని మారాలని మమతా దీదీ క్యాడర్, నేతలకు చెబుతున్నాం. ఒకవేళ మారకపోతే వారి చేతులు, కాళ్లు, పక్కటెముకలను విరగ్గొడతాం. వాళ్లు తమ ఇళ్లకు వెళ్లకముందే ఆస్పత్రులకు పోవాల్సి ఉంటుంది. అల్లర్లను పెంచుకుంటూపోతే మాత్రం వారిని శ్మశానానికి పంపుతాం’ అని దిలీప్ ఘోష్ పేర్కొన్నారు.