యాదగిరిగుట్టకు బాంబు బెదిరింపు.. కల్యాణకట్ట వద్ద బాంబు పెట్టారంటూ 100కు ఫోన్‌

యాదగిరిగుట్టకు బాంబు బెదిరింపు.. కల్యాణకట్ట వద్ద బాంబు పెట్టారంటూ 100కు ఫోన్‌

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో బాంబు కలకలం చెలరేగింది. యాదగిరిగుట్టలోని కల్యాణకట్ట సమీపంలో బాంబు పెట్టారని ఓ నంబర్‌‌‌‌ నుంచి 100కు బుధవారం కాల్‌‌‌‌ వచ్చింది. దీంతో అలర్ట్‌‌‌‌ అయిన పోలీసులు వెంటనే గుట్టకు చేరుకొని ‌‌‌‌కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, అన్నప్రసాద వితరణ కేంద్రం వద్ద డాగ్‌‌‌‌, బాంబ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌తో తనిఖీలు చేపట్టగా ఎలాంటి బాంబు కనిపించలేదు. గురువారం యాదగిరిగుట్టలో మిస్‌‌‌‌ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటన ఉన్న నేపథ్యంలో ఎవరో కావాలనే 100 ఫేక్‌‌‌‌ కాల్‌‌‌‌ చేసి ఉంటారని పోలీసులు నిర్ధారించారు. 100కు ఫోన్‌‌‌‌ చేసిన నంబర్‌‌‌‌కు తిరిగి కాల్‌‌‌‌ చేస్తే స్విచాఫ్‌‌‌‌ అని వస్తోందని, సెల్‌‌‌‌ నంబర్‌‌‌‌ ఆధారంగా ఫోన్‌‌‌‌ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు.